టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం విజయ్ 'డియర్ కామ్రేడ్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతోంది.

దర్శకుడు పూరి జగన్నాథ్.. విజయ్ దేవరకొండని కలవడానికి కాకినాడ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. విజయ్ ఉంటోన్న ఓ హోటల్ లో పూరి అతడితో మీటింగ్ పెట్టాడట. విజయ్ తో పూరి ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. 

ఈ మేరకు అతడిని కలిసి కథ వినిపించడానికే కాకినాడ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. పూరి స్పెషల్ గా కాకినాడ వరకు వెళ్లడానికి కారణం.. ఒకప్పుడు విజయ్ దేవరకొండ తండ్రి పూరి కలిసి పని చేశారట. ఇద్దరూ కలిసి దూరదర్శన్ లోడాక్యుమెంటరీలకు సంబంధించిన పనులు చేసేవారట.

ఆ స్నేహం కారణంగా విజయ్ కి పూరి అంత ప్రాధాన్యతనిస్తున్నాడని తెలుస్తోంది. అలానే కాకినాడలో రామ్ తో పూరి చేయబోయే సినిమాకి లోకేషన్స్ ని వెతుకుతున్నారట. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ ఓ సినిమా చేయడం ఖాయమని మాత్రం తెలుస్తోంది.