ఇస్మార్ట్ శంకర్ చిత్రం సూపర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్  మంచి జోష్ మీద ఉన్నాడు. వరస ప్రాజెక్టులకు ప్లాన్ చేసుకుంటున్నారు. ముందుగా విజయ్ దేవరకొండతో ప్లాన్ చేసిన ఫైటర్ తో హిట్ కొట్టి, ఆ తర్వాత ఓ పెద్ద ప్రాజెక్టు ని చేపట్టాలని ఆలోచనలో ఉన్నాడు. ప్రభాస్ తో తన తదుపరి సినిమా ఉండాలని అనుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఆయన తన కుమారుడు ఆకాష్ తో మొదలెట్టిన సినిమాని మాత్రం సైలెంట్ మోడ్ లో పెట్టేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

పూరి కుమారుడు పూరి ఆకాశ్ ‘మెహబూబా’ సినిమాతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆకాశ్‌కి సంబంధించిన కొత్త సినిమాను చిత్రం టీమ్ ఆ మధ్యన  టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తో సహా ప్రకటించింది. ఈ చిత్రానికి ‘రొమాంటిక్’ అనే టైటిల్‌ను  ఫిక్స్ చేసింది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడా ఆ టాపిక్ రావటం లేదు. ఇస్మార్ట్ శంకర్ తో పాటుగా ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తైందని వినికిడి. ఇండస్ట్రీలో అయితే ఈ సినిమా ఆపేసారని ప్రచారం జరుగుతోంది.

అయితే అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాని ఆపలేదు. పూరి జగన్నాథ్ కొన్ని సీన్స్ ని రీషూట్ చేయాలని, రిపేర్లు చేయాలని డైరక్టర్ కు సూచించారట. అవి పూర్తయ్యాక తను పూర్తిగా తృప్తి చెందాకే సినిమా రిలీజ్ చేద్దామని చెప్పారట. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. అప్పటిదాకా సినిమా గురించి మీడియాలో రానివ్వద్దని స్ట్రిక్ట్ గా చెప్పారట. తన కొడుకుని సైతం ఈ సినిమా గురించి మాట్లాడవద్దు..ఎక్సపెక్టేషన్స్ పెంచద్దు అన్నాడట. రెండో సినిమాతో ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని, తన తమ్ముడు సాయిరాం శంకర్ లా మారకూడదుని పూరి ఆలోచన అని చెప్తున్నారు.  అయితే ఆయన ఫ్యామిలీలో మాత్రం ఈ విషయమై ప్రెజర్ ఉందిట. పూరి భార్య , కుమారుడు ఈ సినిమా రిలీజ్ గురించి ఎదురుచూస్తున్నారట.

పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘రొమాంటిక్’ను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ లవ్ స్టోరీ ద్వారా అనిల్ పాదూరి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.  ఈ చిత్రంలో ఆకాశ్ కొత్తగా స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ కథను అందిస్తున్నారు.