ఈ మ్యాటర్ పై మహేష్ మహా సైలెంట్..ఎందుకు?
సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు కానీ.. ఎక్కడా మహేష్ చిన్న సౌండ్ కూడా చేయలేదు. ఈ సినిమా గురించి ఓ ట్వీట్ కానీ, రీ ట్వీట్ గానీ చేయలేదు.
సోషల్ మీడియా వచ్చాక ప్రతీ చిన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోతోంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో అభిమానులు ప్రతీ చిన్న డిటేల్ ని కూడా పట్టించుకుంటున్నారు. నిలదీస్తున్నారు..నిజమేంటని ఆరా తీస్తున్నారు. రీసెంట్ గా సూపర్‌స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు కానీ.. ఎక్కడా మహేష్ చిన్న సౌండ్ కూడా చేయలేదు. ఈ సినిమా గురించి ఓ ట్వీట్ కానీ, రీ ట్వీట్ గానీ చేయలేదు.
ఈ సినిమా ప్రకటనను హారిక హాసినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్ వారు తమ ట్విట్టర్ ఎక్కౌంట్ ద్వారా ఎనౌన్స్ చేసారు. అలాగే మహేష్ బాబు పీఆర్, ఆయన ప్రొడక్షన్ హౌస్ జిఎమ్ బి ఎంటర్టైన్మెంట్ వారు కూడా ఇదే మ్యాటర్ ని తమ సోషల్ మీడియా ఎక్కౌంట్ లో పోస్ట్ చేసారు. కానీ ఎందుకో మహేష్ మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉండిపోయారు. చివరకు ఇదే మ్యాటర్ ని రీట్వీట్ చేసినా సరిపోయేది. కానీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేది మీడియాలో చర్చనీయాశంగా మారింది. అయితే అభిమానులు మాత్రం అఫీషియల్ లాంచింగ్ సమయంలో ఎలాగూ మాట్లాడతాం కదా అని లైట్ తీసుకున్నాడంటున్నారు.
ఇక ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చాయి. దాదాపు 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారవటంతో అంతటా ఆసక్తి నెలకొంది. దీంతో మహేశ్ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు నిర్మిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ సినిమా విడుదల కానుంది. హీరోయిన్, నటీనటుల గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మహేశ్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారువారిపాట’లో బిజీగా ఉన్నారు. కరోనా వల్ల ఆ షూటింగ్ వాయిదా పడింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నట్లు ఇప్పటికే చిత్ర టీమ్ ప్రకటించింది. మరోవైపు త్రివిక్రమ్ పవన్‌కల్యాణ్, రానా కలయికలో మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఎన్టీఆర్‌తోనూ ఒక సినిమా చేసే అవకాసం ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.