Asianet News TeluguAsianet News Telugu

#FDFS: అనుదీప్ ని ఆడేసుకుంటున్నారు.. పద్ధతేనా?

అనుదీప్ కథ అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. అనుదీప్ కథ అందించడం, పవన్ కళ్యాణ్ ఖుషి నేపథ్యంలో నడిచే పీరియాడిక్ కామెడీ సినిమా కావడం, ట్రైలర్‌లో మంచి ఫన్ కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. 

 Why media blame Anudeep for First Day First Show movie?
Author
First Published Sep 4, 2022, 4:52 PM IST

 2021 మార్చ్ లో కరోనా తర్వాత మొట్టమొదటిసారిగా బ్లాక్బస్టర్ అయిన తెలుగు సినిమా "జాతి రత్నాలు" కి దర్శకత్వం వహించిన అనుదీప్ కేవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయారు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న అనుదీప్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే చాలాకాలం పాటు తన నెక్స్ట్ సినిమా గురించి మౌనం వహించిన అనుదీప్ కేవీ ఎట్టకేలకు తన రెండవ సినిమాగా తను స్క్రిప్టు, దర్శకత్వ పర్యవేక్షణ అందించిన సినిమాతో మన ముందుకు వచ్చారు. 

 అనుదీప్ కథ అందించిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల అయింది. అనుదీప్ కథ అందించడం, పవన్ కళ్యాణ్ ఖుషి నేపథ్యంలో నడిచే పీరియాడిక్ కామెడీ సినిమా కావడం, ట్రైలర్‌లో మంచి ఫన్ కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా నిలబెట్టుకుందా? అంటే అసలు లేదనే చెప్పాలి. 

 ప్రమోషన్ తో  ఓ రేంజిలో హంగామా చేసిన ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా మొదటి ఆట పూర్తి కావడం పూర్తికాగానే..... పూర్తి నెగటివ్ టాక్ తెచ్చేసుకుంది. ఈ వీకెండ్  కూడా గడవటం కూడా కష్టమనేలా ఉందని రివ్యూలు వచ్చాయి. ఇద్దరు కొత్త దర్శకులు బాధ్యతలు తీసుకున్నా రచన చేసిన అనుదీపే ప్రమోషన్లలో హైలైట్ అయ్యాడు. తనకొచ్చిన జాతిరత్నాలు బ్రాండ్ ని ఉపయోగించుకుని యూత్ ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి కాసింత బజ్ తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు.  కానీ జాతి రత్నాలు మ్యాజిక్ మాత్రం ఇక్కడ అస్సలు వర్కవుట్ కాలేదు. 

దాంతో మీడియా మొత్తం అనుదీప్ ని టార్గెట్ చేసినట్లైంది. ముఖ్యంగా సోషల్ మీడియా,వెబ్ మీడియాలో అనుదీప్ గురించి దారుణంగా చర్చ మొదలైంది. జాతిరత్నాలు ఏదో ఆ టైమ్ లో ఫ్లూక్ గా వచ్చిన హిట్ అని, నాగ్ అశ్విన్ ఆ ప్రాజెక్టు వెనక ఉన్నాడు కాబట్టి హిట్ కొట్టగలిగాడు కానీ ప్రతీ సారీ ఆ మ్యాజిక్ జరగదని ఈ సినిమా ప్రూవ్ చేసిందని అంటున్నారు. 

 అనుదీప్ లో మంచి కామిక్ సెన్స్ ఉంది  కానీ ప్రేక్షకులను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడమే దెబ్బ తీసిందంటున్నారు. ఫస్ట్ డే ఫస్ట్ షో విషయంలో అతను కామెడీని సీరియస్ గా రాసుకోలేదని చెప్తున్నారు. అసలు ఎత్తుకున్న పాయింట్ లోనే సమస్య ఉందని,  పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ దొరకటమనేది ఏదో పెద్ద జీవిత సమస్య అన్నట్లు ట్రీట్ చేసి చూపించారని, అదేమీ నవ్వు రాలేదని చిరాకు తెప్పించిందని చెప్తున్నారు.

అయితే విమర్శలు చేసేటప్పుడు ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి.  ఒక్క సినిమాతోనే అనుదీప్ లో విషయంలేదని ఎలా సర్టిఫై చేసేయగలుగుతారు. మహా మహా పెద్ద దర్శకులకే ప్లాఫ్ లు, డిజాస్టర్స్  వస్తున్నాయి. ఒక్కోసారి తాము అనుకున్నది తెరపైకి వచ్చే లోగా చాలా జరిగే అవకాసం ఉంది. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి అప్పట్లో పెద్ద ప్లాఫ్. తర్వాత ఆయన తేరుకుని అలవైకుంఠపురములో వంటి హిట్ కొట్టలేదు.

 నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణల కామెడీ టైమింగ్ జాతిరత్నాలుకు పెద్ద ప్లస్ కాగా, ఈ సినిమాలో లీడ్ కాస్ట్ అంతా కొత్త వాళ్లే కావడం దెబ్బ కొట్టి ఉండచ్చు. అదే విధంగా కొత్త దర్శకులు కూడా అనుభవ రాహిత్యంతో.. ఆ స్క్రిప్టుని సరిగ్గా డీల్ చేసి ఉండకపోయి ఉండవచ్చు. అంతమాత్రానికి అనుదీప్ తదుపరి చిత్రం ప్రిన్స్ పై అనుమానం వచ్చేలా ఆర్టికల్స్ రాయటం, మరీ పర్శనల్ గా తీసుకుని దారుణ విమర్శలకు పాల్పడటం మాత్రం పద్దతి కాదు.  

మరీ ఇంతలా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న దర్శకుడుని  టార్గెట్ చేయటం మాత్రం దారుణం. ఎన్నో సక్సెస్ లు ఇచ్చిన పూరి జగన్నాథ్ సైతం రీసెంట్ గా  లైగర్ తో బోల్తా పడ్డారనే విషయం మర్చిపోకూడదు. సినీ పరిశ్రమలో జయాపజయాలు అత్యంత సహజం.  అయినా ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా  వలన నిర్మాతలు ఏ మాత్రం నష్టపోలేదని తెలుస్తోంది. చాలా తక్కువ బడ్జెట్ లో తీయటం, ఓటిటిలోనూ మంచి రేటు పలకటం జరిగిందని వినికిడి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios