రవితేజ, శృతిహాసన్‌ జంటగా గోపిచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న చిత్రం 'క్రాక్'. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ మాస్‌ యాక్షన్‌ అవతారంలో కనిపించనున్నాడు.  సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయబోతున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌కటించారు. మిగతావాళ్లెవరూ థైర్యం చేయని సిట్యువేషన్ లో ఈ సినిమా రిలీజ్ ని ప్రకటించటం అంతటా ఆశ్చర్యంగా మారింది.

 ఇప్పటికే ఈ సినిమా ఓటీటి రిలీజ్ కోసం జీ గ్రూప్ తో చర్చలు జరిగాయి. అయితే లాస్ట్ మినిట్ లో వద్దనుకుని థియోటర్ రిలీజ్ కు సై అన్నారు. అలాగే సంక్రాంతికి పోటీ ఉంటుందని తెలిసీ రిలీజ్ కు పెట్టారు. ఇదంతా సినిమాపై టీమ్ కు ఉన్న కాన్ఫిడెన్సే అంటున్నారు. ముఖ్యంగా హీరో రవితేజ కన్నా ఎక్కువగా దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మి రిలీజ్ డేట్  ప్రకటించేలా చేసాడంటున్నారు. 

మరో ప్రక్క నిర్మాతలు...ఇంక ఎక్కువ కాలం ఈ సినిమాని ఆపితే ఫైనాన్స్ వడ్డీలు పెరుగుతాయని భావించారట. ఓటీటిలో అనుకున్న రేటు రాలేదని,అందుకే ఈ నిర్ణయం తీసుకుని థియోటర్ లో వదులుతున్నారని టాక్. దానికి తోడు పెద్ద సినిమాలు కొనేముందు ఓటీటిలు సినిమాని పూర్తిగా చూసి రేటు ఫిక్స్ చేస్తామని అనటం కూడా ఓ కారణం అంటున్నారు. ఏదైమైనా క్రాక్ సంక్రాంతి రిలీజ్ వెనక టీమ్ నమ్మకమో లేక వేరే సమస్యలు ఉన్నాయా అనేది రిలీజ్ అయితే కానీ ఆ సీక్రెట్ రివీల్ కాదు.
 
 రాజా ది గ్రేట్ చిత్రం త‌ర్వాత  స‌రైన హిట్ సాధించని ర‌వితేజ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. రీసెంట్‌గా   ఈ చిత్రంలోని ‘భలేగా తగిలావ్‌ బంగారం’ అనే లిరికల్‌ వీడియోను చిత్రబృందం  విడుదలచేసింది. అనిరుధ్ ఆల‌పించిన ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించగా తమన్‌ బాణీలను సమకూర్చారు. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటిస్తోంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతి ఈ సినిమాతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది.