1989లో రాజమండ్రి ఎంపీగా తాను గెలుపొందానని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం డబ్బు లేకపోవడం వల్లనే ఓడిపోయాననే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదనన్నారు.
అలనాటి మేటి నటీమణుల్లో ఒకరైన జమున ఇవాళ హైదరాబాద్ లో తన స్వగృహంలో చివరి శ్వాస తీసుకున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆవిడ శివైక్యం చెందటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపధ్యంలో ఆమె గురించిన గత సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు . నటిగానే కాకుండా రాజమండ్రి మాజీ పార్లమెంటు సభ్యురాలుగా జమున రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే ఏడెనిమిది ఏళ్ల క్రితమే ఆమె వాటికి దూరమయ్యారు. అలా ఎందుకయ్యారనడానికి ఆమె కారణాలు చెప్పారు.
జమున మాట్లాడుతూ...నేటి రాజకీయాలు సచ్ఛీలత, విలువలకు దూరమయ్యాయని, డబ్బుతో ముడిపడి వున్నాయని, అందువల్లనే వాటిలో ఇమ డలేక తాను దూరంగా ఉన్నానని చెప్పారు. అప్పట్లో భీమవరం మావుళ్లమ్మ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరైన జమున విలేకరులతో మాట్లాడారు. ఒకప్పుడు రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమనే భావం ఉండేదని, ఇప్పుడు మాత్రం రూ.లక్షలు ఖర్చుపెట్టి రూ.కోట్లు సంపా దించు అనే రీతిలో మారిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
1989లో రాజమండ్రి ఎంపీగా తాను గెలుపొందానని, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం డబ్బు లేకపోవడం వల్లనే ఓడిపోయాననే విషయాన్ని ఇప్పటికీ మర్చిపోలేదనన్నారు. డబ్బు చుట్టూ తిరిగే రాజకీయాల వల్లనే తాను వాటికి దూరంగా ఉంటూ కళాకారుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని చెప్పా రు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ప్రోదల్బంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. అప్పట్లో కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు, కొణిజేటి రోశయ్య వంటి నాయకులు తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. అనంతరం మహిళా కాంగ్రెస్‌లో పనిచేసినా నేటీ రాజకీయాల్లో ఇమడలేక బయటకు వచ్చినట్టు జమున స్పష్టం చేశారు.
తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా జమున నటించగా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి.బాల్యంలోనే జమున సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు.ఆమె నటనకు ఎన్నో అవార్డులు సైతం లభించాయి.జమున ఎన్నో సేవాకార్యక్రమాలు చేసి మంచి పేరును సంపాదించుకున్నారు.అ
