నాగ్ తో చేసిన అన్నమయ్య సినిమాతో తెలుగులోనూ మంచి  గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కస్తూరి. ఆ తర్వాత కమల్ తో చేసిన భారతీయుడు సినిమా ఆమెలోని నటిని పూర్తిగా ఆవిష్కరించింది. ఆకాశ వీధిలో అనే చిత్రంలోనూ నాగార్జున పక్కన నటించింది. తర్వాత కాలంలో సినిమా కెరీర్ డల్ అవ్వటంతో  ప్రస్తుతం బుల్లితెర వైపు దృష్టి పెట్టింది. అక్కడా  బాగానే క్రేజ్ తెచ్చుకుంది. గృహలక్ష్మీ అనే సీరియల్‌తో బాగానే ఫేమస్ అవుతోంది. అన్నిటికి  మించి సోషల్ మీడియాలో ఆమె బాగా ఏక్టివ్ గా ఉంటోంది. రెగ్యులర్ గా తన ఫాలోవర్స్ తో ఆమె మాట్లాడుతూ ఉంటుంది. వారి ప్రశ్నలకు జవాబులు ఇస్తూంటుంది. అయితే ఆమె ఎప్పుడూ తన భర్త, పిల్లల ఫొటోలు కానీ, డిటేల్స్ కానీ సోషల్ మీడియాలో షేర్ చేయదు. ఇది గమనించిన కొందరు ఆమెను అదే విషయమై ప్రశ్నించారు. దానికి ఆమె షాకింగ్ రిప్లై ఇచ్చింది.
 
“ పర్వర్ట్ లు మా  పిల్లలను సైతం టార్గెట్ చేస్తున్నప్పుడు, మేము మా కుటుంబ విషయాలు, ఎందుకు చెప్పాలి ? మా పర్సనల్ విషయాలు, భర్త విషయాలు మీకెందుకు చెప్పాలి.. అవన్నీ సేకరించి రేషన్ కార్డ్ ఇస్తావా? నా ప్రెవేట్ లైఫ్ నాది, ఇదేమీ ఎగ్జిబిషన్ కాదు, నా కుటుంబ సబ్యులకు, స్నేహితులకు ఆ విషయాలు తెలిస్తే చాలు ,” అని తేల్చేసింది.

ఇక కస్తూరి అమెరికాకు చెందిన ఓ డాక్టరును పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన భర్త అమెరికాలోనే ఉంటున్నాడని తెలిపింది. ఓ టీనేజ్ కుమార్తె ఉంది. ఇక ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి క్యాస్టింగ్ కౌచ్ సమస్యలపై పోరాడుతున్నానని తెలిపింది. ఇదిలా ఉండగా.. ఆ మధ్యన ఓ టీవీ ఛానెల్ లో మాట్లాడుతూ...ప్రస్తుత హీరోలలో ఏ హీరోకి తల్లిగా నటిస్తారు? అనే ప్రశ్నకి.. నేను ఏ హీరోకి తల్లిగా చేయను. నేను చేయాలంటే ఆ సినిమాలో హీరోనే డ్యూయెల్ రోల్ చేయాలి. అటు హీరోకి భార్యగా.. ఇటు అదే హీరోకి తల్లిగా చేస్తానని అంటోంది. ఇక యంగ్ హీరో విజయ్ దేవరకొండకు తల్లిగా నటిస్తారా..? అని అడిగితే అసలు ఛాన్సే లేదంటుంది. ఎందుకంటే విజయ్ దేవరకొండ పై తనకు చాలా క్రష్ ఉందని చెప్పుకొచ్చింది.