హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?

హాస్యనటుడు విజయ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?

కమీడియన్ విజయ్ సాయి ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని కుదిపేస్తున్నది. ఆయనకు ఎందుకు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడనేదానికి కారణాలు  వెల్లడికావడం లేదు.కుటుంబ కలహం కారణమని ఒక కథనం వినబడుతున్నది.  
 విజయ్, వనితతో వివాహమయింది. అయితే, వారిద్దరి మధ్యమధ్య మనస్పర్థలు తలెత్తాయి. చివరకు ఇది విడాకులు దాకా దారి తీసింది. ఇద్దరు విడిపోయారు.  వారికి  ఒక పాప ఉంది. విడాకుల తర్వాత పాప వనిత సంరక్షణలోనే ఉంది. ఈ మధ్య పాపను  చూసేందుకు కూడా భార్య అనుమతించడం లేదని తెలుస్తున్నది. ఇదే విజయ్ తీవ్ర మనస్థాపానికి కారణమని ఆయన మిత్రలు కొందరు  చెబుతున్నారు. ఇదే ఆయన డిప్రెషన్ కు కారణమని చెబుతున్నారు. విడాకుల తర్వాత కూడా వారిద్దరి మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మూడు రోజుల కిందటకూడా ఆమె విజయ్ ఇంటికి వచ్చి గొడవ చేసినట్లు చెబుతున్నారు. అంతేకాదు,విజయ్ కారును కూడా తీసుకుపోయిందని మీడియా కథనం. వీటన్నింటి వల్ల పూర్తిగా డిప్రెషన్ లో పడిపోయి ఆయయన యూసఫ్ గూడ లోని ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. విజయ్ తల్లి (ఫోటో) కూడా ఇదే కథనం  వినిపించే తన కుమారుడి మృతికి కోడలే కారణమని ఆరోపిస్తున్నారు.

 


బొమ్మరిల్లు, మంత్ర, ఏకలవ్యుడు, ఇందుమతి, నా గాళ్‌ఫ్రెండ్ బాగా రిచ్ వంటి చిత్రాల్లో కమెడియన్‌గా ఆయన నటించారు.

 

 

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page