బాలకృష్ణ సినిమాలను, దర్శకులను ఎంచుకుంటున్న తీరు చాలా మందిని అయోమయంలో పడేస్తోంది. ఆయన కోసం కథ రాసుకుని తిరుగుతున్న వాళ్లకు ఆయన తన ఫంధా మార్చుకుని చేస్తున్న సినిమాలతో ఆశ్చర్యపరుస్తున్నారు. సాదా సీదా రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్స్ కు ఆయన దూరంగా ఉండాలనే  ప్రయత్నం చేస్తున్నారు. అయితే వినాయిక్ వంటి దర్శకులు ఇవేమి పట్టించుకోకుండా బాలయ్య తోనే సినిమా చేయాలని, తమ కథకు ఆయన అయితేనే సరిపోతారని భావించి ప్రయత్నాలు చేస్తున్నారు. 

బాలయ్య చేద్దామనుకున్నా ఆయన అనుకున్న స్క్రిప్టు రావటం లేదు. దాంతో  తాజా సమాచారం ప్రకారం వినాయిక్, బాలయ్య కాంబినేషన్ లో సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఆ మధ్యన బాలయ్యతో సూపర్ హిట్స్ ఇచ్చిన బి గోపాల్ కూడా చాలా కాలం బాలయ్యను మరో మాస్ మసాలా కథలో చూపాలని ఉవ్విళ్లూరారు. కానీ బాలయ్య ముందుకు వెళ్లనివ్వలేదు.  అదే పరిస్దితి వినాయిక్ కు కూడా ఎదురైంది. ఓ మాస్ కథతో వచ్చిన వినాయిక్ కు బాలయ్య ఇలాంటి కథను ఇప్పట్లో చేసేదిలేదని స్పష్టం చేసారట. బయిట నడుస్తున్న ట్రెండ్ ప్రకారం వెళ్లాదమని, అది హిట్ అయినా , ప్లాఫ్ అయినా ఫేడవుట్ అవటం జరగదని వివరించారట. బాలయ్య అంత క్లారిటీగా చెప్పటం వినాయిక్ కు ఆశ్చర్యం వేసిందిట.

బాలయ్య బిగ్ నో చెప్పటంలో  వినాయక్ తన కథను రవితేజకు వినిపించారట. రవితేజకు కూడా కథ బాగా నచ్చిందని సమాచారం. కాగా వీరి సినిమా త్వరలోనే పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ఇక గతంలో వీరి కాంబినేషన్ లో ‘కృష్ణ’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమాకు సి కళ్యాణ్ నిర్మాతగా ఉంటారని వినపడుతోంది. 

ఇక వినాయిక్ దర్శకుడు కథను తెరకెక్కించటంలో ఫెయిల్ కాకపోవచ్చేమో కానీ  ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్లుగా కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం అయ్యారనేది నిజం.  అందుకే వివి వినాయక్‌కు ఇటీవల సరైన విజయం లేదని అందరూ తేల్చేసారు. వివి వినాయక్ తెరకెక్కించిన మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ఖైదీ నెం 150 చిత్రం ఘనవిజయం సాధించినా.. ఆ తరువాత వచ్చిన ఇంటెలిజెట్ మూవీ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ నేపధ్యంలో గ్యాప్ తీసుకున్న వినాయిక్ ఇప్పుడు ఓ స్క్రిప్టు రెడీ చేసుకుని తన స్టామినా ఏంటో చూపాలని ఫిక్స్ అయ్యారట.