గత కొంతకాలంగా గోపిచంద్ కు సరైన హిట్ అనేది పడలేదు. ఆయన ప్రతీ సినిమా భాక్సాపీస్ వద్ద డిజాస్టర్ అవుతూ వస్తోంది.  అయితేనేం అతని తాజా చిత్రం మాత్రం ఓ రేంజి బడ్జెట్ తో రూపొందుతోంది. దాంతో ఆ బడ్జెట్ కు తగ్గట్లుగా బిజినెస్ అవుతుందా అనే సందేహం ట్రేడ్ సర్కిల్స్ లో మొదలైంది. గోపిచంద్ తో 35 కోట్లు పెట్టి సినిమా చేస్తున్నట్లు సమాచారం. అది రిస్కే అంటున్నారు. నిర్మాత అనీల్ సుంకర కూడా మొదట ఇంత బడ్జెట్ అంటే ఆలోచనలో పడ్డారట. 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ కు ఈ సినిమా ఎలాగైనా చెయ్యాలనే ఆలోచనతో  తన రెమ్యునేషన్ ని షూటింగ్ పూర్తయ్యాక తీసుకుంటానని మాట ఇచ్చి ప్రాజెక్టు లాక్ చేసాడంటున్నారు. హీరోనే అంత ధైర్యంగా ముందుకు వస్తున్నప్పుడు రిస్క్ తీసుకోవటంతో తప్పు లేదని నిర్మాత అనీల్ సుంకర భావించారట.

వివరాల్లోకి వెళితే..  గోపీచంద్‌ హీరోగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది.  ఇదో స్పై థ్రిల్లర్‌. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సోమవారం ఇండియా–పాకిస్థాన్‌ సరిహద్దులో గుజరాత్‌లోని జైసల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. సినిమాను స్టార్ట్‌ చేయడమే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో మొదలుపెట్టారు గోపీచంద్‌ అండ్‌ టీమ్‌.  

దూకుడు, వన్ నేనొక్కిడినే వంటి చిత్రాలు తర్వాత అనీల్ సుంకర..భారీ బడ్జెట్ లు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే తిరు చెప్పిన లైన్ నచ్చటంతో నమ్మి ఈ సినిమా చేస్తున్నారు. ఏ మాత్రం తేడా కొట్టినా 35 కోట్లు మటాష్ అని ఆయనకూ తెలుసు. అయితే కేజీఎఫ్ వంటి యాక్షన్ చిత్రం ఘన విజయం సాధించటం, అడవి శేషు గూఢచారి సినిమా హిట్ అవటం ఈ సినిమాపై నమ్మకాన్ని పెంచాయంటున్నారు. ఆ ధైర్యంతోనే ఈ సినిమా చేస్తున్నారంటున్నారు. 

ప్రస్తుతం సెల్వన్‌ ఆధ్వర్యంలో  ఫైట్ సీన్స్  తెరకెక్కిస్తున్నారు. యాభై రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో రాజస్థాన్‌,  దిల్లీల్లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు.  ‘‘యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. గోపీచంద్‌ పాత్ర ఓ కొత్త కోణంలో సాగుతుంది. మేలో విడుదల చేస్తాము’’అన్నారు నిర్మాత. విశాల్‌ శేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి రచన: అబ్బూరి రవి, ఛాయాగ్రహణం: వెట్రి పళని స్వామి, కళ: రమణ వంక.

తిరు దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ స్పై థ్రిల్లర్‌ రూపొందుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. సోమవారం ఇండియా–పాకిస్థాన్‌ సరిహద్దులో గుజరాత్‌లోని జైసల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ను స్టార్ట్‌ చేశారు. ‘‘50 రోజుల పాటు సాగే షెడ్యూల్‌లో ఫైట్‌ మాస్టర్‌ సెల్వన్‌ కంపోజ్‌ చేసిన సాహసోపేతమైన ఫైట్‌ సీన్స్‌ షూట్‌ చేస్తాం. అలాగే రాజస్థాన్, న్యూ ఢిల్లీలో షూటింగ్‌ జరపనున్నాం. వేసవిలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: వెట్రి, మాటలు: అబ్బూరి రవి.