Asianet News TeluguAsianet News Telugu

కాంట్రవర్శీ అవుతుందనే ‘ఆదిపురుష్’ఈవెంట్ లో ఆ మేటర్ తప్పించారా?

ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామీజీ హాజరయ్యారు.

Why Adipurush team ignores Saif Ali Khan ?
Author
First Published Jun 7, 2023, 1:27 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో  తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’.  దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను రామాయణ ఇతిహాసం  ఆధారంగా తెరకెక్కించారు. చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారత్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తోన్న సినిమా ‘ఆదిపురుష్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

 తాజాగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ తో పాటు ముఖ్య అతిథిగా ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామీజీ హాజరయ్యారు. అలాగే ఇటు సినీ ప్రముఖులతో పాటు అటు ప్రభాస్ అభిమానులతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది.  ఈవెంట్ కు మంచి అప్లాజ్ వచ్చింది. అంతా బాగుంది కానీ ఈ ఈవెంట్ లో ఎక్కడా సైఫ్ అలీ ఖాన్ పేరు మాత్రం వినపడక పోవటం షాక్ ఇచ్చింది. కావాలనే ఈ ఈవెంట్ లో సైఫ్ ని ప్రక్కన పెట్టారని, అది ఓ స్ట్రాటజీ అని సోషల్ మీడియా అంటోంది. ప్రభాస్ తో సైతం సినిమాలో ప్రధాన పాత్ర అయిన సైఫ్ గురించి మాట్లాడకపోవటం ఆశ్చర్యమే. 

ఇంతకు ముందు మొదట టీజర్ రిలీజైనప్పుడు చాలా విమర్శలు వచ్చాయి.  ఆ  టీజర్ నచ్చని మరి కొంతమంది నెటిజన్లు ప్రభాస్‌ని, ఓం రౌత్‌ని, మూవీ మేకర్స్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభాస్ లుక్కు దగ్గర నుంచి మూవీలో యానిమేషన్ వరకూ అన్నింటిపైన ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా.. ఇందులో రావణుడిగా సైఫ్ అలీఖాన్ లుక్‌ మీదైతే విపరీతమైన విమర్శలు చేశారు. అందులో.. ఓ నెటిజన్ అయితే బ్రిటీష్ టీవీ షో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ షోతో పొల్చారు. అందులో.. రావణుడు ఓ రాక్షస పక్షి మీద వస్తున్న పిక్‌ని షేర్ చేసి.. ‘ఏంటి రావణుడు కూడా టార్గెరీయన్ హా’ అంటూ వెటకారంగా రాసుకొచ్చాడు. ఈ పోస్టుపై పలువురు స్పందిస్తూ.. ‘అవును వాళ్లకి చాలా ఏళ్ల ముందు తరం వాడు’, ‘రావణుడి కళ్లు వైట్‌వాకర్‌లా ఉన్నాయి’, ‘అది వైకింగ్‌కి టార్గెరీయన్‌కి పుట్టిన క్రాస్ బ్రీడ్.. లైగర్’ అంటూ విచిత్రమైన కామెంట్స్ చేశారు. మరి కొందరైతే ‘రావణుడు ఏటి తైమూర్‌లా ఉన్నాడు’, ‘రావణుడిని మొగల్‌గా మార్చేశారు’ అంటూ ట్వీట్స్ చేశారు.

ఇవన్నీ దృష్టి లో పెట్టుకుని  సైఫ్ అలీ ఖాన్‌ను కొంతకాలం పాటు సినిమా రిలీజ్ అయ్యేదాకా ప్రమోషన్స్ లో  దూరంగా ఉంచడం ద్వారా ఆ పాత్రపై వివాదాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వినపడుతోంది. అలాగే మరో విషయం ఇప్పటికి రిలీజైన ట్రైలర్స్ లో ఎక్కడా రావణుడు పాత్రను పూర్తి స్దాయిలో రివీల్ చేయలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios