'ఈ రోజుల్లో ..'  అనే సినిమా మారుతికు డైరక్టర్ గా కెరీర్  ఇస్తే..శైలజా రెడ్డి అనే సినిమా ఆయనకు గ్యాప్ తెచ్చేసింది.  గత కొద్ది రోజులుగా మారుతి ఏ హీరోకు సినిమా చేయాలనే డైలమోలో ఉన్నట్లు సమాచారం. మంచి టాలెంట్ ఉంది, అంతకు మించి పరిచయాలు, మెగా క్యాంప్ అండ ఉండి కూడా తన తదుపరి చిత్రం మొదలు పెట్టలేకపోతున్నాడు. 

శైలజారెడ్డి చిత్రం రిలీజ్ కు ముందు అల్లు అర్జున్ , రామ్, గోపీచంద్ లకు కథలు చెప్పి ఓకే చేయించుకున్న మారుతి... ఆ తర్వాత వారిలో ఎవరితోనూ సినిమా మొదలెట్టలేకపోయాడు. ఆ హీరోల నుంచి సరైన రెస్పాన్స్ లేకో ,నిర్మాతలు ఉత్సాహం చూపకో కాదట...వాళ్లలో ఎవరూ కొత్త సినిమా సైన్ చేసేటంత ఖాళీగా లేకపోవటమే కారణం అని చెప్తున్నారు. 

అయితే శైలజా రెడ్డి హిట్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు డేట్స్ ఎడ్జెస్ట్ చేసుకుని సినిమా మొదలెడుదురు. కానీ నాగచైతన్యతో చేసిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దాంతో ఇప్పుడు మారుతి..అందరూ కొత్త వారితో ఓ చిన్న సినిమా మొదలెడదామా అనే ఆలోచనలో ఉన్నాడట. 

మహేష్,రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమా చేయటం ఈజీ అవుతుందేమో కానీ నాని, శర్వానంద్, నాగచైతన్య వంటి వారితో సినిమా అంటే అసలు డేట్స్ దొరకటం లేదంటున్నారు.  మరి మారుతి  హీరోలు చుట్టూ తిరగటం ఆపి తిరిగి తన పాత రోజుల్లోకి వెళ్లే అవకాసం ఉందన్నమాట.