వెంకటేశ్ - వరుణ్ తేజ్ హీరోలుగా కొంతకాలం క్రితం వచ్చిన 'ఎఫ్ 2' నాన్ స్టాప్ వినోదాన్ని పంచింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా 'ఎఫ్ 3' రెడి అయ్యి రిలీజ్ అవుతోంది. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందింది.
రెగ్యులర్ గా ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. అలాంటి వాటిలో ఒకటి 2019లో విడుదలయిన 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల దగ్గర నుండి మంచి ఆదరణ పొందింది. అందుకే దీనికి సీక్వెల్‌గా 'ఎఫ్ 3'ను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్.. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వెంకటేశ్ కలిసి మల్టీ స్టారర్ చేయడం 'ఎఫ్ 2'కు ఎక్కడలేని హైప్ క్రియేట్ అయ్యింది. దాంతో పాటు కామెడీ కూడా బాగా పండడంతో ఎఫ్ 2 సూపర్ హిట్‌గా నిలిచింది. అందుకే అదే కాంబినేషన్‌తో 'ఎఫ్ 3'తో మరోసారి నవ్వించడానికి వచ్చేస్తున్నాడు అనిల్ రావిపూడి.
ఇప్పటికే విడుదలయిన 'ఎఫ్ 3' ట్రైలర్‌లో వెంకటేశ్, వరుణ్ తేజ్ కలిసి నవ్వులు పూయించారు. అంతే కాకుండా వెంకటేశ్‌కు ఈ సినిమాలో రేయి చీకటి ఉండడం.. వరుణ్ తేజ్‌కు నత్తి ఉండడం లాంటి అంశాలు మరింత ఫన్ క్రియేట్ చేసేలాగా ఉన్నాయి. క్యాస్టింగ్ విషయానికొస్తే.. ఎఫ్ 2లో ఉన్న నటీనటులే దాదాపు ఇందులో కూడా ఉన్నారు. అంతే కాకుండా ఇది మొత్తంగా మనీ చుట్టూ తిరిగే కథలాగా అనిపిస్తోంది. ఎఫ్ 3 సినిమా మే 27న విడుదల కానుంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం నిమిత్తం ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న వారెవరు అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...వెంకీ, వరుణ్ 5-7 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుని సినిమా చేశారు. ఇక తమన్నా 2 కోట్లు, మెహ్రీన్ కోటి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ దాదాపు 3 కోట్లు వసూలు చేశాడని, మిగిలిన టెక్నీషియన్లు సాధారణ వేతనానికి మాత్రమే పనిచేశారని అంటున్నారు.
ఇక ఈ ప్రాజెక్టు నిమిత్తం అత్యథిక రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక వ్యక్తి దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఎఫ్ 2 టైమ్‌లో దిల్ రాజు అనిల్‌కి దాదాపు 3 కోట్లు ఇచ్చినట్లు చెప్పబడుతుండగా, అతను ఎఫ్ 3 కోసం దాదాపు రూ. 15-18 కోట్లు తీసుకున్నాడు. భార్యల పోరు పడలేక ఎక్కువ డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న భర్తల కథ ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు.
