Asianet News TeluguAsianet News Telugu

నిజమైన పాన్ ఇండియా స్టార్ ఎవరు?... ప్రభాస్-బన్నీ మధ్య తీవ్రస్థాయిలో నడుస్తున్న సోషల్ మీడియా వార్!

అల్లు అర్జున్ మొదటి అడుగు బాలీవుడ్ లో సక్సెస్ అయిన నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరాడు. ఇక టాలీవుడ్ నుండి హిందీలో సక్సెస్ సాధించిన హీరోలుగా ప్రభాస్(Allu Arjun), అల్లు అర్జున్ నిలిచారు.

who is the biggest pan india star fan war between allu arjun prabhas fans
Author
Hyderabad, First Published Jan 25, 2022, 12:25 PM IST

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ సర్వసాధారణం. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పంటూ కొట్టుకోవడం కొత్తేమీ కాదు. ఈ సోషల్ మీడియా యుద్ధాలలో ఎవరూ తగ్గరు. అలసిపోయే దాకా వాదించుకుంటారు. ఈ మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ విషయంలో తగ్గేదేలే అంటున్నారు. మా హీరోకి సరిలేరు ఎవ్వరూ అంటున్నారు. దేశంలోనే అతిపెద్ద పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. అదే క్రమంలో టాలీవుడ్ నుండి ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది పరస్పరం ప్రభాస్-అల్లు అర్జున్ ఫ్యాన్స్ గొడవపడడానికి కారణం అవుతుంది. 

పుష్ప (Pushpa)మూవీ అల్లు అర్జున్ కెరీర్ లో భారీ హిట్ గా నిలిచింది. నిజానికి పుష్ప అల వైకుంఠపురంలో చిత్రం కంటే భారీ వసూళ్ళేమి రాబట్టలేదు. అయితే పాన్ ఇండియా చిత్రంగా విడుదలైంది. అలాగే అనూహ్యంగా హిందీలో భారీ ఆదరణ దక్కించుకుంది. పుష్ప తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగల్చగా... హిందీలో మాత్రం లాభాలు తెచ్చిపెట్టింది. దాదాపు రూ. 85కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు పుష్ప హిందీ వర్షన్ వసూలు చేసింది. 

అల్లు అర్జున్ మొదటి అడుగు బాలీవుడ్ లో సక్సెస్ అయిన నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చేరాడు. ఇక టాలీవుడ్ నుండి హిందీలో సక్సెస్ సాధించిన హీరోలుగా ప్రభాస్(Allu Arjun), అల్లు అర్జున్ నిలిచారు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఈ విషయంలో సోషల్ మీడియా వార్స్ కి దిగుతున్నారు. ఒకరిపై మరొకరు నెగిటివ్ కామెంట్స్ చేసుకుంటున్నారు. రకరకాల నెగిటివ్ ట్యాగ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేస్తున్నారు. 

అసలైన పాన్ ఇండియా స్టార్ మా హీరో అంటే మా హీరో అంటూ కొట్టుకుంటున్నారు. ప్రభాస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ సోషల్ మీడియా యుద్దాన్ని అందరూ గమనిస్తున్నారు. టాలీవుడ్ లో చాలా కాలంగా ఫ్యాన్ వార్స్ ఉన్నాయి. ప్రధానంగా ఒకప్పుడు చిరంజీవి-బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ తీవ్ర స్థాయిలో ఉండేది. ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలైతే రచ్చ మాములుగా ఉండేది కాదు. ఆ తర్వాత మహేష్(Mahesh babu)-ఎన్టీఆర్-పవన్ ఫ్యాన్స్ మధ్య ఈ వార్ నడిచేది. స్టార్ హీరో రేసులో ప్రభాస్ అల్లు అర్జున్ ముందుకు దూసుకురావడంతో  కొత్త ఫ్యాన్ వార్స్ మొదలవుతున్నాయి. 

ఈ ఫ్యాన్ వార్స్ శృతిమించితే ప్రమాదమే. కోలీవుడ్ లో ఇది మరింత తీవ్రస్థాయిలో ఉంటుంది. కొన్నాళ్లుగా విజయ్-అజిత్ ఫ్యాన్స్ మధ్య పచ్చిగడ్డేస్తే మండే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 

ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఎన్టీఆర్ ఫ్యాన్ ఒకరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని హత్య చేశాడు. అప్పట్లో ఇది సంచలనమైంది. ఇలాంటి చర్యలకు పాల్పడేవారు నా అభిమానులు కారని, ఎన్టీఆర్ తీవ్రంగా ఖండించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios