మెగాస్టార్ మెచ్చిన నటుడు ఎవరో తెలుసా..? చిరంజీవికి ఆ నటుడంటే ఎంతో ఇష్టమట.
మెగాస్టార్ మెప్పుకోసం ఎంతో మంది నటులు పరితపిస్తుంటారు. ఆయన చూపుపడితే చాలు అన్నట్టుగా ఎదురుచూస్తుంటారు. అటువంటిది చిరంజీవి మెచ్చిన నటుడు ఎవరో తెలుసా..? ఆయన్ను మెప్పించిన విలక్షన నటుడి గురించి తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ నట శిఖరం. తెలుగులో ఎంతో మంది నటులు, నట వారసులు ఉండగా.. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. మెగాస్టార్ రేంజ్ గు ఎదిగాడు చిరంజీవి. అంతే కాదు తనతో పాటు తన కుటుంబంలో హీరోలను తయారు చేసి.. ఇండియాలోనే అతి పెద్ద సినిమా కుటుంబంగా మెగా ఫ్యామిలీని తయారు చేశాడు చిరంజీవి. ఇక ఈక్రమంలో ప్రస్తుతం ఇండస్ట్రీకి పెద్దన్నగా.. ఏసమస్య వచ్చినా ముందుండి నడిపిస్తున్నారు చిరు. ఇక ఇంత చేస్తున్న మెగాస్టార్ కోసం తపించనివారు ఉంటారా. ఆయన తమ నటనను మెచ్చుకోవాలి అని చూసేవారు చాలా మంది ఉన్నారు.
అయితే ఇంతకీ మెగాస్టార్ చిరంజీవికి బాగా నచ్చిన నటుడు ఎవరు..? అప్పట్లో అంటే.. ఆయనకు ఎస్వీఆర్, ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి వారు వారినటన ఇష్టం అని చెప్పారు. కాని ఇప్పుడుఉన్న నటులు.. ఆతరం విలక్షణ నటులలో ఆయన మెచ్చిన నటుడు ఎవరోతెలుసా.. ప్రకాశ్ రాజ్. అవును.. ప్రకాశ్ రాజ్ నటన అంటే చిరంజీవికి చాలా ఇష్టం అట. పలు సందర్భాలలో చిరంజీవి చెప్పిన మాటలు ఇవి. ప్రకాశ్ రాజ్ నటన.. ఏ పాత్ర అయినా ఆయనకు సరిపోయేలా మలుచుకునే విధానం.. చిరంజీవికి ఎంతో నచ్చుతుందట.
విలన్ గా, కమెడియన్ గా, హీరో హీరోయిన్లకు తండ్రిగా, తాతగా.. ఇలా ఎన్నో పాత్రలు చేశారు ప్రకాశ్ రాజ్. తన పక్కన హీరోయిన్ గా నటించిన రమ్యకృష్ణకు గుంటూరు కారం సినిమాలో తండ్రి పాత్రలో నటించాడు. ఇలా ఏ పాత్రం చేసినా.. అందులో పరకాయ ప్రవేశం చేస్తారు ప్రకాశ్ రాజ్. అందుకే ఆయన అంటే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఇష్టపడతారు. అందులో మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రకాశ్ రాజ్ నటన అంటే ఎంతో ఇష్టమట.
ఇక ప్రస్తుతం ప్రకాశ్ రాజ్ కు పెద్దగా సినిమాలు రావడం లేదు. ఆయన కూడా ఇండస్ట్రీలో మునుపటిలా యాక్టీవ్ గా లేరు. పాలిటిక్స్ మీద ప్రకాశ్ రాజ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి ప్రజెంట్ విశ్వంభర సినిమా చేస్తున్నాడు. బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఈసినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల తరువాత చిరు సరసన ఆమె నటిస్తోంది. 2025 సంక్రాంతికి ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్.