Asianet News TeluguAsianet News Telugu

#Unstoppable2:వెనుక ఉండి నడిపిస్తోంది బాలయ్య కూతురే..ఎలాగంటే

అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌పై అప్పుడే అంచనాలు క్రియేట్ కావడంతో, అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ టాక్ షో గురించి అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతగానో చర్చించుకుంటున్నారు. 

Who is behind Balakrishna Unstoppable with NBK season 2
Author
First Published Oct 14, 2022, 12:42 PM IST


బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షోతో ప్రేక్షకులను అలరించడంలో ఆయన కృషితో పాటు మరొకరి హ్యాండ్ కూడా ఉంది. బాలయ్య రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ టాక్ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహిరంచారు. ఆమె తన తండ్రి లుక్స్, కాస్ట్యూమ్స్ వంటి విషయాలపై చాలా రిసెర్చ్ చేసి, మన ముందుకు అల్ట్రా స్టైలిష్ బాలయ్యను తీసుకువచ్చింది తేజస్విని. ఆమె అన్‌స్టాపబుల్ షో కోసం ఏ విధంగా కష్టపడిందో డైలాగ్ రైటర్ బీవీఎస్​ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోన్న ‘అన్‌స్టాపబుల్ 2’ ప్రోమో మేకింగ్ వీడియోలోనూ మనకు తేజస్విని కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె రెండో సీజన్ కోసం కూడా ఇంతగా కష్టపడుతుందా అని అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌ను అక్టోబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా, తొలి ఎపిసోడ్‌కు గెస్టులుగా నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్‌లు వస్తున్నారు.
  
ఈ మొదటి ఎపిసోడ్‌కు తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌ను తీసుకొచ్చాడు. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు నా బంధువుని తీసుకొద్దామని అనుకున్నా.. కానీ ప్రజల బంధువుని తీసుకొస్తే బెటర్ అనిపించింది.. మీ అందరికీ బాబు.. నాకు బావ అంటూ చంద్రబాబు గురించి బాలయ్య అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చాడు. 

తనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని బాలయ్య సరదాగా అనడం.. వసుంధరకు ఫోన్ చేస్తాను అని బాబు ఫోన్ తీయడం సరదాగా సాగింది. ఇక ఇలా సరదాగా సాగుతున్న ప్రోమోలో కాస్త సీరియస్ అంశాలను కూడా జోడించారు. వెన్నుపోటు సంఘటనలు కూడా ప్రస్థావించారు. 95లో అతి పెద్ద నిర్ణయం తీసుకున్నానని, అది తప్పు నిర్ణయమా? అని బాలయ్యను సూటిగా అడిగేశాడు బాబు. నాటి సంఘటనలను బాబు గుర్తు చేసుకున్నాడు.

తనకు అత్యంత ఆప్త మిత్రుడు వైఎస్సార్ అని బాబు చెప్పుకొచ్చాడు. నువ్ సినిమాల్లో చిలిపి పనులు చేస్తే మేం కాలేజీల్లో చేశామంటూ బాబు తన రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇక నారా లోకేష్ ఎంట్రీతో ఇంకాస్త సరదాగా సాగింది ప్రోమో. బాలయ్య, చంద్రబాబులను కలిపి నారా లోకేష్ ప్రశ్నలు అడిగాడు. కాసేపు హోస్ట్‌గా మారిన లోకేష్.. బాబు, బాలయ్య పర్సనల్ విషయాలను కూపీ లాగే ప్రయత్నంచేశాడు. ఇంట్లో భార్యకు ఎవరు బాగా భయపడతారు.. వంటలు ఎవరు చేస్తారంటూ ఇలా పర్సనల్ ప్రశ్నలు వదిలాడు లోకేష్.

 ఈ సీజన్ కు ఇది పెద్ద బ్లాస్టర్ అవుతుందని, సరిగ్గా ప్లాన్ చెయ్యమని చెప్పారట. ఈ ఎపిసోడ్ క్లిక్ అయితే మరింత మంది రాజకీయనాయకులను సైతం ఇక్కడికి అహ్వానించే అవకాసం ఉంది. మొత్తానికి ఆహా అనిపించాలనే తపనతో టీమ్ అదిరిపోయే ఐడియాలు ప్లాన్ చేస్తోంది. 

అన్‌స్టాపబుల్ 2 తొలి ఎపిసోడ్‌పై అప్పుడే అంచనాలు క్రియేట్ కావడంతో, అందరూ ఈ ఎపిసోడ్ కోసం ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ టాక్ షో గురించి అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలు ఎంతగానో చర్చించుకుంటున్నారు. ఒకే వేదికపై బాలయ్య, చంద్రబాబు, నారా లోకేశ్‌లను చూడటం కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాజకీయాలకు సంబంధించి బాలయ్య టాక్ షోలో ఎలాంటి చర్చ సాగుతుందో చూడాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios