మెగాహీరోలను 'ఒరేయ్' అని పిలిచినందుకు పెద్ద క్లాస్: అల్లు అరవింద్

who gave class to allu aravind
Highlights

మెగాహీరోలను క్యాజువల్ మ్యానర్ లో పిలవడం నాకు అలవాటు. కానీ అలా పిలిచినందుకు రీసెంట్ గా నాకు ఒకరు క్లాస్ తీసుకున్నారు. నన్ను క్షమించండి.. తేజ్ ను ఇంక వాడు వీడు అని పిలవను

మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిథిగా విచ్చేసిన అల్లు అరవింద్.. తేజ్ ను ఉద్దేశిస్తూ గొప్పగా మాట్లాడారు. ఇచ్చిన కమిట్మెంట్ కోసం ఎంతైనా కష్టపడతాడు అంటూ అతడిని పొగిడిన అల్లు అరవింద్ మరికొన్ని విషయాలను స్టేజ్ పై వెల్లడించారు. ఒకానొక సమయంలో తేజ్ ను 'వీడు' అని సంబోధించి వెంటనే మెగాఫ్యామిలీ హీరోలను 'వాడు.. వీడు.. ఒరేయ్' అని పిలవడం తనకు అలవాటని ఆ విధంగానే తేజ్ ను కూడా పిలిచానని కానీ అలా పిలుస్తున్నందుకు నాకు పెద్ద క్లాస్ పడిందని అరవింద్ అన్నారు. 

''మెగాహీరోలను క్యాజువల్ మ్యానర్ లో పిలవడం నాకు అలవాటు. కానీ అలా పిలిచినందుకు రీసెంట్ గా నాకు ఒకరు క్లాస్ తీసుకున్నారు. నన్ను క్షమించండి.. తేజ్ ను ఇంక వాడు వీడు అని పిలవను'' అని సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వెంటనే తేజ్ మీరు ఎలా అయినా నన్ను పిలవచ్చు.. మీకు నచ్చినట్లు పిలవండి అంటూ చెప్పాడు. అయితే ఇప్పుడు అరవింద్ కు క్లాస్ తీసుకున్నది ఎవరై ఉంటారా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

చిరంజీవి వయసుకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూమాట్లాడతారు. ఆయనే అరవింద్ ను పబ్లిక్ ఈవెంట్స్ లో మెగాహీరోలను అరేయ్, ఒరేయ్ అనొద్దని చెప్పి ఉంటాడని కొందరు అంటుంటే.. అల్లు అర్జున్ తన తండ్రిని అందరికి గౌరవం ఇచ్చి మాట్లాడమని చెప్పి ఉంటాడని మరికొందరు అంటున్నారు. కానీ యువహీరోలు మాత్రం తమకంటే పెద్దవాళ్లు స్టేజ్ పై వారి ఏమని సంబోధించినా.. పెద్దగా పట్టించుకోవడం లేదు. 

loader