బాహుబలి'లో బాహుబాలి - శివగామి .. ఈ రెండు పాత్రలు మంచివే. అయితే ఒకానొక సందర్భంలో ఈ రెండు పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఆ సినిమాలో అది కొంతసేపు మాత్రమే చూపించాము. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విషయంలో మాత్రం కథ అంతా కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంటుంది.
కథ రాసుకునేటప్పుడు ఓ హీరోని అనుకుని కన్సీవ్ చేసి, చివరకు వేరే హీరో చుట్టూ తిరిగి,ఫైనల్ గా అసల ఊహించని హీరోతో సినిమా చేయటం, హిట్ కొట్టడం చాలా సార్లు జరిగేదే. అయితే రాజమౌళి వంటి దర్శకులు రాసుకునే భారీ కథలకు సాధారణంగా మొదటే హీరోని ఫైనలైజ్ చేసుకుంటారు. అప్పుడు వాళ్లకు తగ్గ ఎలివేషన్స్ చేయటానికి వీలుంటుందని వారి అభిప్రాయం. బాహుబలి కథ అప్పట్లో ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకునే రాసారు అంటారు.అదే విధంగా ఆర్.ఆర్. ఆర్ కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లను దృష్టిలో పెట్టుకునే మొదటి నుంచే రాసారా అంటే కాదనే చెప్తున్నారు. మరి ఎవరిని దృష్టిలో పెట్టుకుని విజయేంద్రప్రసాద్ గారు ఆ స్టోరీని కన్సీవ్ చేసారు.
మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడానికి రాబోతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్” . ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో చిత్ర కధా రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడారు. ఆయన ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని అడిగారు. దానికాయన సమాధానం ఇచ్చారు.
విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ...మొదట తాము కథ అనుకున్నప్పుడు ఏ హీరోలను అనుకోకుండా ముందుకు వెళ్లాలనుకున్నామని చెప్పారు. ఆ తర్వాత రజనీకాంత్- అర్జున్, సూర్య-కార్తీ ఇలా చాలా కాంబినేషన్స్ అనుకున్నాము కానీ ఫైనల్ గా ఈ ఇద్దరి హీరోల దగ్గరికే వచ్చి ఆగామన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఎంచుకోవటానికి కారణం...ఇద్దరు హీరోలు నిజ జీవితంలో మంచి స్నేహితులైతే తెరపై అనుబంధం ఇంకా బాగాఎస్టాబ్లిష్ అవుతుందనే ఉద్దేశ్యంతో చేసామన్నారు.
ఇక బాహుబలి'లో బాహుబాలి - శివగామి .. ఈ రెండు పాత్రలు మంచివే. అయితే ఒకానొక సందర్భంలో ఈ రెండు పాత్రల మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అయితే ఆ సినిమాలో అది కొంతసేపు మాత్రమే చూపించాము. 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విషయంలో మాత్రం కథ అంతా కూడా అలాంటి ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో హీరోలు .. విలన్లు అని కాకుండా కథను బట్టి .. తమ సిద్ధాంతాలను బట్టి పాత్రలు నడుస్తుంటాయి అని రాజమోళి చెప్పారు.
ఆలియాభట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో.. అజయ్ దేవగన్, శ్రియ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మించారు. . ఆర్ ఆర్ ఆర్ సినిమాకు (Rated U/A) U/A సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా టోటల్ రన్ మూడు గంటల ఆరు నిమిషాలు వచ్చింది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్,రామ్ చరణ్‌లతో పాటు సముద్ర ఖని, అలియా భట్, శ్రియ, ఒలివియా మోరీస్‌ల నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే యూఎస్‌లో ఎన్టీఆర్ ఓ అభిమాని ఏకంగా థియేటర్ నే బుక్ చేయడం విశేషం.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనే ముందు రోజు రాత్రి నుంచి స్పెషల్ షోస్ వేయనున్నారు. ఈ సినిమా నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌తో పాటు శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.
