Asianet News TeluguAsianet News Telugu

హాట్ టాపిక్: కీరవాణి రిజెక్ట్ చేసిన బయోపిక్ ఈ రెంటిలో ఏది?!

‘‘వాస్తవానికి దూరంగా.. డ్రాస్టిక్‌గా వెళ్లకూడదు. అలా చేస్తే జనం చూడరు. తెలుగువారికి ఆరాధ్యనీయుడైన ఓ కీర్తిశేషుడిపై బయోపిక్‌ తీయాలనుకుని ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చాడు. 

Which Biipic Keeravani refused to work?
Author
Hyderabad, First Published Jan 7, 2019, 8:01 AM IST

''వాస్తవానికి దూరంగా.. డ్రాస్టిక్‌గా వెళ్లకూడదు. అలా చేస్తే జనం చూడరు. తెలుగువారికి ఆరాధ్యనీయుడైన ఓ కీర్తిశేషుడిపై బయోపిక్‌ తీయాలనుకుని ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చాడు. కానీ ఆయన ఎలా మరణించారని చూపిస్తారు... వివాదాస్పదంగానా.. లేక దేవుడిలో జ్యోతిగా ఐక్యమైనట్టా అని అడిగా. రెండూ కాదు... మూడోరకంగా ఆలోచిస్తున్నామని ఆ దర్శకుడు చెప్పారు. దణ్ణం పెట్టి, చేయననేశా’’ అని కీరవాణి  రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలో  చెప్పాడు. దాంతో ఆయన రిజెక్ట్ చేసిన బయోపిక్ ఏది అనే విషయం అంతటా ఓ పెద్ద టాపిక్ గా మారింది. 

ప్రస్తుతం తెలుగులో  బయోపిక్‌ల సీజన్  నడుస్తోంది. ఇప్పటికే  సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ‘మహానటి’ఘన విజయం సాధించింది ఇలాంటి సినిమాలకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎలక్షన్స్ దగ్గర పడుతూండటంతో ..ఇప్పుడిక పొలిటికల్ టచ్ ఉన్న బయోపిక్‌లు వరుస కడుతున్నాయి. ‘యన్.టి.ఆర్’,‘యాత్ర’ ఒకదాని తర్వాత ఒకటి థియేటర్స్ లో దూకబోతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జీవితంలోని వాస్తవ కోణాల్ని చూపిస్తానంటూ రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో రెడీ అవుతున్నాడు.   ‘యన్.టి.ఆర్’కు ఎలాగో కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఆయన రిజెక్ట్ చేసిన బయోపిక్ ...మిగిలిన ఆ రెండింటిలోనూ ఉండాలి. 

కొందరేమో ..కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ యాత్ర  సినిమానే కీరవాణి రిజెక్ట్ చేసాడని అంటున్నారు . వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అర్దాంతరంగా చనిపోయారు .  తెలుగువారి ఆరాధ్యనీయుడు అని చెప్పాడు కదా ! ఎన్టీఆర్ తర్వాత వై ఎస్ మాత్రమే పరిపాలకుడిగా ముద్ర వేసుకున్నాడు మరి ఆయనే అయ్యింటాడని అంటున్నారు మరికొందరు.

కాదు..కాదు.. కీరవాణి చెబుతున్న మాటలు.. అభ్యంతరాలు  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకే వర్తించేలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గతంలో కీరవాణితో పనిచేసారు. ఆ పరిచయం,చనువుతో తన సినిమాకు సంగీతం అడిగితే కాదన్నారని, ఆయన సోదరుడుని ఆ ప్రాజెక్టులోకి తీసుకున్నారని మీడియా అంటోంది. ఈ వెర్షన్స్ లో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios