సాధారణంగా సినిమా రిలీజ్ రోజు ...హైదరాబాద్ ప్రసాద్ ఐ మ్యాక్స్ లో కానీ, ఆర్టిసీ క్రాస్ రోడ్ థియోటర్స్ లో కానీ హీరోలు సినిమాలు చూస్తూంటారు...కానీ 


 ప్రభాస్(Prabhas) రాముడిగా చేసిన ఆదిపురుష్ గురించి అంతటా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా గత కొద్ది రోజులుగా ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ గా అవతరించింది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రేపు అంటే జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రభాస్ ఈ సినిమాని ఎక్కడ చూడబోతున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు .. ఆల్రెడీ ప్రభాస్ అమెరికా వెళ్లిపోయారు. ఈ సినిమాను ఆయన అక్కడే చూస్తారని చెబుతున్నారు. అక్కడ కొంతమంది అభిమానులతో కలిసి ఈ సినిమాని ఆయన చూడబోతున్నారని వినికిడి. ఈ మేరకు ఏర్పాట్లు జరిగాయంటున్నారు. అయితే ప్రభాస్ ఏ థియేటర్ లో చూడబోతున్నారనే విషయం మాత్రం బయిటకు రాలేదు. ఇక ఈ సినిమా బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటే, సంచలనానికి తెరతీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

మరో ప్రక్క రిలీజ్ కు ముందే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ వచ్చేశాయట. రిలీజ్ కు ముందే మేకర్స్ రూ.500 కోట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. దీంతో ఈ సినిమా మేకర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టనుంది. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారానే రూ.155 కోట్లు వచ్చాయి. ఈ విషయంలో టాలీవుడ్ లో ఆదిపురుష్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక దేశవ్యాప్తంగా హక్కుల ద్వారా మరో రూ.120 కోట్లు వచ్చాయి. ఇక ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కుల కింద మరో రూ.210 కోట్లు రావడంతో.. ప్రొడ్యూసర్లు సేఫ్ సైడ్ ఉన్నారు. రిలీజ్ తరువాత కలెక్షన్లు కూడా భారీగానే వచ్చే అవకాశం ఉంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం.. రూ.1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా అని అంచనా లు వేస్తున్నారు.