రామ్ వద్దని తప్పు చేసాడా? తేలేటట్లు లేదు

 సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేసిన సినిమా  కావడంతో, ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ గట్టి పట్టు పట్టుతో ఉన్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత ఎన్నీఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు. 

When will Ram Red movie release? jsp

  క‌రోనా దెబ్బతో సినీ ఇండ‌స్ట్రీ మొత్తం స్తంభించిపోయింది. క‌రోనా లాక్‌డౌన్ కార‌ణంగా థియేట‌ర్ల‌న్నీ మూత ప‌డ్డాయి. దీంతో చాలా సినిమాలు విడుద‌ల ఆగిపోయాయి. మ‌రోవైపు మ‌ధ్య‌లోనే మ‌రికొన్ని చిత్రాల షూటింగులు నిలిచిపోయాయి. ఈ నేపధ్యంలో  చాలా సినిమాల‌ని ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు ద‌ర్మ‌క నిర్మాత‌లు. దానికి తగ్గట్లే ఓటీటీ ప్లేయ‌ర్స్ మంచి రేటును కూడా ఆఫ‌ర్ చేస్తున్నారు. దాంతో నాని సినిమా ‘వి’, అనుష్క నిశ్శబ్దం, రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ చేసారు. అయితే ఈ సినిమాలు మూడింటిలో ఏదీ ఆడలేదు. ఈ నేపధ్యంలో ఓటీటిలో రిలీజ్ చేస్తే సినిమాకు మూడినట్లే అనే టాక్ బాగా హీరోల్లో, దర్శక,నిర్మాతల్లో నాటుకుపోయింది. ఎట్టిపరిస్దితుల్లోనూ తమ సినిమాలను థియోటర్ లోనే రిలీజ్ చేయాలని ఓ స్దాయి హీరోలు పట్టుపడుతున్నారు. ఆ కోవలోనే రామ్ కొత్త చిత్రం ‘రెడ్’ డిజిట‌ల్ ఫ్లాట్ ఫామ్‌లో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ అనుకున్నా రామ్ అడ్డుపడి ఆపారని సమాచారం. 
 
 సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత రామ్‌ హీరోగా చేసిన సినిమా  కావడంతో, ఈ సినిమా పై మంచి హైప్ ఉంది. అందుకే ఈ సినిమా రిలీజ్ విషయంలో రామ్ గట్టి పట్టు పట్టుతో ఉన్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని మొదట ఏప్రిల్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలనుకున్నారు, కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఫోన్ అయింది. ఆ తరువాత ఎన్నీఆఫర్లు వచ్చినా ఓటిటీలో రిలీజ్ చేయము అని మేకర్స్ స్పష్టం చేశారు. 

అందుతున్న సమాచారం  మేరకు అన్ని కుదిరితే  సంక్రాంతికి నేరుగా థియేటర్ లో రిలీజ్ చేయాలనేది రామ్ ప్లాన్. కానీ ఇప్పుడున్న పరిస్దితిని బట్టి చూస్తే...సంక్రాంతికైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందని నమ్మకంగా చెప్పలేని పరిస్థతి. మరి చివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలంటున్నారు సినిమా జనం. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మించారు. 'తడమ్' అనే తమిళ చిత్రానికి రీమేకే ఈ రెడ్ సినిమా  . ఇందులో రామ్ పోతినేని డ్యూయల్ రోల్ పోషిస్తుండగా రామ్ సరసన నివేదా పెతురాజ్, మాల్వికా శర్మ, అమృత అయ్యర్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios