పోర్న్ స్టార్ గా కెరీర్ ఆరంభించిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్ గా బిజీ అయిపోయింది. ఆమెకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా.. ట్రోల్స్ చేసేవారు కూడా ఉన్నారు. కొందరైతే అసభ్యపదజాలంతో ఆమెని దూషిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరైతే బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అలాంటి వారి గురించి తాజాగా ఓ షోలో మాట్లాడింది సన్నీలియోన్. ఒక వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని సన్నీ చెప్పారు. తనను ముంబైలో ఎంతగానో భయపెట్టిన ఒక వ్యక్తి గురించి చెప్పుకొచ్చింది.

అతడు అసభ్యంగా ఈమెయిల్స్ పంపేవాడని, కామెంట్స్ పెట్టేవాడని.. తనను తిట్టడమే కాకుండా ఫ్యామిలీని కూడా దూషించేవాడని.. ఇంటికొస్తానని బెదిరించేవాడని చెప్పుకొచ్చింది. చాలా ఎమోషనల్ గా.. వైలెంట్ గా సందేశాలు పంపించేవాడని.. తనను ఎంతో భయపెట్టినట్లు తెలిపింది.

తన భర్త డేనియల్ లాస్ ఏంజిల్స్ లో ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఇంట్లో ఉంటే ఒక చేతిలో కత్తి పట్టుకొని డోర్ తీయడానికి వెళ్లేదాన్ని అంటూ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించింది. మొత్తానికి అతడి అకౌంట్ ని డిలీట్ చేయించగలిగానని, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.