ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ పని చేస్తోన్న సీనియర్ నటుడు పృధ్వీరాజ్ 18 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృధ్వీరాజ్
ఎన్నో ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీ పని చేస్తోన్న సీనియర్ నటుడు పృధ్వీరాజ్ 18 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృధ్వీరాజ్ రీసెంట్ గా సుదీర్ బాబు నటించిన 'నన్ను దోచుకుందువటే' సినిమాలో నటించాడు.
తన జీవితంలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగా చాలా సార్లు చనిపోవాలని అనుకున్నాడట. ఓ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటూ.. ''అమీర్ పేట్ లో నాకొక ఫ్లాట్ ఉంది. అపార్ట్మెంట్ 14వ ఫ్లోర్ ఎక్కి అక్కడ నుండి దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నాను.
అదే సమయంలో నా అసిస్టెంట్ తో మాట్లాడాను. తనతో మాట్లాడిన తరువాత నా మైండ్ సెట్ మారిపోయింది. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన పక్కన పెట్టేశాను. అలా ఇప్పటివరకు 18 సార్లు చనిపోవాలనుకున్నాను'' అంటూ చెప్పుకొచ్చాడు.
ఇది ఇలా ఉండగా.. సూసైడ్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో చాలా షార్ట్ ఫిలింస్ లో నటించినట్లు చెప్పారు. ప్రస్తుతం పృధ్వీరాజ్ 'ఎన్టీఆర్ కథానాయకుడు' బయోపిక్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
