సమంత ఓ పాటకు నొచ్చుకుంది. ఆ పాట పాడటం తనకు ఇష్టం లేదన్నట్లు ఆమె ముఖ కవళికలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
ఖుషి మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. వేదిక మీద సమంత-విజయ్ దేవరకొండ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ హైలెట్ అయ్యింది. నిజమైన ప్రేమికులు మాదిరి వారు మమేకమై రొమాన్స్ కురిపించారు. ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. కాగా ఖుషి ఆడియో రిలీజ్ వేడుకలో సమంత ఓ ఇబ్బందికర సందర్భం ఎదుర్కొన్నారు. ఆమె ఒకింత నొచ్చుకున్నారు. మజిలీ చిత్రంలోని 'ప్రియతమా ప్రియతమా' సాంగ్ ని ఓ లేడీ సింగర్ వేదిక మీద పాడారు.
ఆ పాట పాడుతున్నంత సేపు సమంత ముఖం మారిపోయింది. ఏదో తెలియని అసహనం, ఇబ్బంది సమంతలో కనిపించాయి. ఈ పాట ఎప్పుడు పూర్తవుతుందిరా బాబు.. అన్నట్లు ముఖం పెట్టింది. దానికి కారణం అది నాగ చైతన్య సాంగ్ కావడమే. నచ్చినవాడిని రహస్యంగా ఆరాధించే అమ్మాయి మనసు గురించి చెప్పే సందర్భంలో ఆ పాట వస్తుంది. మజిలీ మూవీలో నాగ చైతన్యను పిచ్చిగా ప్రేమించే అమ్మాయిగా, భార్యగా సమంత నటించారు.
ఆ సినిమాలోని పాట ఖుషి వేదిక మీద పాడటంతో మాజీ భర్త నాగ చైతన్యను గుర్తు చేసినట్లు అయ్యింది. అదే సమయంలో ఆయన మీద ఆమె కోపాన్ని రెచ్చగొట్టేలా చేశారని కొందరి వాదన. విడాకుల అనంతరం సమంత చేసిన కామెంట్స్ నేపథ్యంలో నాగ చైతన్య మీద ఆమె పీకల్లోతు కోపంతో ఉంది. అతన్ని గుర్తు చేసే ఏ సంఘటనను సమంత తీసుకోలేకపోతున్నారనే మాట వినిపిస్తోంది.
ఇక ఖుషి సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దర్శకుడు శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఖుషి సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా మీద అంచనాలు ఏర్పడ్డాయి. వరుస ప్లాప్స్ లో ఉన్న విజయ్ దేవరకొండకు ఈ చిత్ర విజయం చాలా అవసరం.
