పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ప్రస్తుతం  కాశీ  టూర్ లో ఉన్నారు. ఆమె స్నేహితులతో కలిసి వారణాసి వెళ్లడం జరిగింది. వారణాసిలో పూర్తిగా ఆధ్యాత్మికంగా మారిపోయిన రేణూ దేశాయ్ తన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అయ్యాయి.  కాశిలో పవిత్ర గంగా నదికి పూజా కార్యక్రమాలు ఆమె నిర్వహించారు. అలాగే కాశీ పట్టణం శివారులోని గంగా తీరం నుండి ఆమె వీడియో చాట్ లో అభిమానులతో మాట్లాడారు. 

ఆ సందర్భంలో ఆమె ఫ్యాన్స్ అనేక ప్రశ్నలు అడిగారు. కొందరు రేణు పై అభిమానంతో మీరు జాగ్రత్త అంటూ కామెంట్స్ పెట్టారు. అంతా బాగున్నా... రేణు దేశాయ్ కి కొన్ని కామెంట్స్ నచ్చలేదు. ఓ నెటిజెన్ రేణు దేశాయ్ ని మీ ఏజ్  ఎంత అని అడిగారు. ఈ విషయం రేణూ దేశాయ్ ని కొంచెం చిరాకు పెట్టినట్లు ఉంది. నా వయసుతో పనేంటి, దాని అవసరం ఏముందని కొంచెం అసహనం వ్యక్తం చేశారు రేణూ దేశాయ్. 


రేణూ దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.  ఆమె ప్రధాన పాత్రలో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది . చిత్రీకరణ దశలో ఉన్న ఈ వెబ్ సిరీస్ లో రేణూ దేశాయ్ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమానిగా కనిపిస్తారట. అలాగే త్వరలో దర్శకత్వం కూడా ఆమె చేయనున్నారు. ఆమె తెరకెక్కించనున్న మూవీ ప్రీ  ప్రొడక్షన్ పనులు పనులు జరుగుతున్నాయని సమాచారం. దేశంలోని రైతుల సమస్యలపై కూడా ఆమె ఓ మూవీ తెరకెక్కిస్తారట.