బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ దాదాపు 30ఏళ్ల నాటి అరుదైన ఫోటో పంచుకున్నారు. ఓ మూవీ ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొనడానికి న్యూ యార్క్ సిటీకి ఇండియా నుండి టాప్ స్టార్స్ అయిన రజిని కాంత్, అమితాబ్ బచ్చన్, శ్రీదేవితో పాటు మరికొందరు వెళ్లడం జరిగింది. 1991లో ఫిబ్రవరిలో హిందీ చిత్రం హమ్ విడుదల కావడం జరిగింది. హమ్ చిత్రంలో అమితాబ్ మరియు రజిని కాంత్ కలిసి నటించారు. 

దర్శకుడు ముకుల్ ఎస్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్ర ప్రొమోషన్స్ కోసం అమితాబ్, రజిని మరియు శ్రీదేవి న్యూయార్క్ వెళ్లడం జరిగింది. హమ్ చిత్రంలో కీలక రోల్ చేసిన అనుపమ్ ఖేర్ చిత్ర యూనిట్ తో పాటు న్యూ యార్క్ వెళ్ళాడు. అక్కడ రజిని మరియు శ్రీదేవిలతో అనేక విషయాలు ముచ్చటించినట్లు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. హమ్ చిత్రంలో నటించకపోయినప్పటికీ శ్రీదేవి ప్రొమోషన్స్ కోసం న్యూయార్క్ వెళ్లడం జరిగింది. 

ఆ అరుదైన ఫొటోలో ఉన్న మిగతా నటులను కనుగొనాలని అభిమానులకు ఫజిల్ విసిరారు అనుపమ్ ఖేర్. అప్పట్లో హమ్ భారీ విజయాన్ని అందుకోగా... ఆ చిత్రంలోని జుమ్మా చుమ్మా దే దే.. ఆల్ టైం ఎవర్ గ్రీన్ సాంగ్ గా ఉంది. 90లలోనే రజినీకాంత్ బాలీవుడ్ లో అమితాబ్ వంటి స్టార్ తో నటించి సత్తా చాటారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anupam Kher (@anupampkher)