లాక్ డౌన్ కారణంగా ఏడు నెలలకు పైగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తుండగా షూటింగ్ తిరిగి ప్రాంభమైంది. గత నెలలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని రాజమౌళి తిరిగి ప్రారంభించారు. హైదరాబాదులో వేసిన ప్రత్యేక సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లపై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. 

కాగా ఈ మూవీలో విలన్స్ గా విదేశీ నటులు రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి నటిస్తున్నారు. బ్రిటీష్ అధికారి స్కాట్ పాత్రలో స్టీవెన్ సన్ నటిస్తుండగా, అతని భార్య రోల్ అలిసన్ డూడి చేస్తున్నారు. కాగా వీరిద్దరు కూడా ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో జాయిన్ అయ్యారు. వాళ్లద్దరి కాంబినేషన్ సన్నివేశాలతో పాటు, ఎన్టీఆర్,  చరణ్ లతో కూడిన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం అందుతుంది. 

ఇక ఎన్టీఆర్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఎప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ కి జోడిగా బ్రిటీష్ స్టేజ్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్ ని ఎంపిక చేయడం జరిగింది. ఐతే ఇంత వరకు ఒలీవియా మోరిస్ షూటింగ్ లో జాయిన్ కాలేదు. 

ఇక ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తున్న రాజమౌళి వచ్చే ఏడాది విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇప్పటికే ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఏడాది ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆలస్యం అయ్యింది. దీనితో రాజమౌళిపై ఒత్తిడి పెరిగిపోయింది. డి వి వి దానయ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ భీమ్ గా, చరణ్ రామరాజుగా చేస్తున్నారు.