ఓ డైరెక్టర్ నంబర్ బ్లాక్ చేశానని హీరోయిన్ రష్మిక మందాన చెప్పడం ఆసక్తికరంగా మారింది. దీనికి కారణాలు ఏంటని పరిశీలిస్తే...  

కర్ణాటకకు చెందిన రష్మిక మందాన చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశారు. కన్నడ చిత్రం కిరిక్ పార్టీ తో ఆమె హీరోయిన్ అయ్యారు. ఆ మూవీ ఆఫర్ తనకు ఎలా వచ్చిందో చెప్పి ఆశ్చర్యపరిచింది. ఓ కొత్త నంబర్ నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందట. మా సినిమాలో మిమ్మల్ని హీరోయిన్ గా తీసుకోవాలి అనుకుంటున్నాము. మీతో మాట్లాడాలని చెప్పారట. ఎవరో ఆటపట్టిస్తున్నారని రష్మిక నాకు ఇంట్రెస్ట్ లేదని ఫోన్ పెట్టేసిందట. అలాగే ఆ ఫోన్ నంబర్ బ్లాక్ లో పెట్టేసిందట. 

 తర్వాత తన టీచర్ ద్వారా ఆ చిత్ర దర్శకుడి నిర్మాత తనను సంప్రదించారట. అప్పుడు నమ్మకం కుదిరిందట. ఆ దర్శకుడితో నాకు నటన రాదని రష్మిక చెప్పారట. కొన్ని డైలాగ్స్ చెప్పి తనతో పలికించి రికార్డ్ చేసుకున్నాడట. తర్వాత రష్మీకి ఆఫర్ ఇచ్చాడట. ఆ విధంగా కిరిక్ పార్టీ మూవీతో రష్మిక మందాన హీరోయిన్ అయ్యారు. కిరిక్ పార్టీ సూపర్ హిట్ కాగా... వెతికి మరీ డైరెక్టర్ ఆమెకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసుగా... కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి. 

కిరిక్ పార్టీ చిత్రానికి దర్శకత్వం వహించింది ఆయనే. రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. ఆ చిత్ర షూటింగ్ లో రష్మిక-రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చితార్థం జరుపుకున్నారు. అనూహ్యంగా రష్మిక మనసు మార్చుకుంది. అది వివాదమైంది. ఆమె మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఛలో, గీతగోవిందం, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. కాంతార మూవీ చూడలేదని రష్మిక చేసిన కామెంట్స్ రిషబ్ శెట్టిని హర్ట్ చేశాయి. రష్మీ పేరెత్తితే ఆయన కయ్యమంటున్నాడు. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. 

ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ కి జంటగా పుష్ప 2 చేస్తున్నారు. అలాగే రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న యానిమల్ మూవీలో నటిస్తున్నారు. నితిన్ తో ఓ ప్రాజెక్ట్ ప్రకటించిన రష్మిక, కొత్తగా రైన్ బో మూవీ చేస్తున్నట్లు వెల్లడించారు. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.