ప్రభాస్ త్రో బ్యాక్ వీడియో ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. సెలెబ్రిటీ క్రికెట్ మ్యాచ్లో పాల్గొన్న ప్రభాస్ అరుదైన ఫుటేజ్ అభిమానులు బయటకు తీశారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాట్ పడితే ఎలా ఉంటుంది? బ్యాటు ఝుళిపించి బౌండరీ కొడితే స్టాండ్స్ ఉన్న అభిమానులు గాల్లోతేలకుండా ఉంటారా?. ఈ అరుదైన సంఘటనకు సంబంధించిన స్పెషల్ వీడియో ప్రభాస్ ఫ్యాన్స్ బయటకు తీశారు. ప్రభాస్ కెరీర్ బిగినింగ్ లో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ లో పాల్గొన్నారు. తన టీం తరపున బ్యాట్స్ మెన్ గా బాధ్యతలు నిర్వర్తించాడు. అప్పట్లో టాప్ హీరోలు చాలా మంది సెలబ్రిటీ క్రికెట్ మ్యాచ్లు ఆడటం జరిగింది. ఈ సందర్భంగా క్రీజులో ఉన్న ప్రభాస్ బంతిని బలంగా బాది బౌండరీకి తరలించాడు.

ఈ మ్యాచ్ కి కమెడియన్స్ వేణు మాధవ్, శ్రీనివాసరెడ్డి కామెంటేటర్స్ గా ఉన్నారు. బౌండరీ కొట్టిన ప్రభాస్ తో బ్యాట్ ఎత్తాలని వేణు మాధవ్ మైక్ లో చెప్పాడు. అలాగే మ్యూజిక్ వేయమన్నారు. వర్షం మూవీలోని 'మెల్లగా కరగని' సాంగ్ ప్లే చేయగా... ప్రభాస్ డాన్స్ మూమెంట్స్ ఇచ్చారు. ఈ త్రో బ్యాక్ వీడియో వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మా హీరో తోపు. ఎక్కడైనా ఉతుకుడే అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం గురించి మాట్లాడితే ప్రభాస్ ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలు విడుదల చేయనున్నారు. పౌరాణిక చిత్రం ఆదిపురుష్ జూన్ 16న విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జనరేషన్ స్టార్ లో ఈ పాత్ర చేసే అరుదైన అవకాశం ప్రభాస్ కి దక్కింది. దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. 

Scroll to load tweet…

ఆదిపురుష్ విడుదలైన మూడు నెలలకు సలార్ విడుదల కానుంది. కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు కీలక రోల్స్ చేస్తున్నారు. సలార్ ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. 

ఇక ప్రాజెక్ట్ కే ప్రభాస్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతుంది. దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. అలాగే దర్శకుడు మారుతితో చేస్తున్న మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ టైటిల్ తో ఓ మూవీ ప్రకటించారు. వచ్చే ఏడాది ఆ మూవీ సెట్స్ పైకి వెళ్లే సూచనలు కలవు.