విశ్వనటుడిగా పేరుగాంచిన కమల్ హాసన్ నటుడు దిలీప్ కుమార్ చేతులు పట్టుకొని బ్రతిమలాడట. తన మూవీలో నటించాల్సిందిగా వేడుకున్నాడట. అయినప్పటికీ దిలీప్ కుమార్ కమల్ రిక్వెస్ట్ ని అంగీకరించలేదట.
1990లలో కమల్ హాసన్ (Kamal Haasan) ఫుల్ ఫార్మ్ లో ఉన్నారు. అప్పటికే ఆయనకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. ఈ క్రమంలో ఆయన చిత్రంలో నటించాలంటూ బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ ని అడుగగా ఆయన అంగీకరించలేదట. ఈ విషయాన్ని కమల్ హాసన్ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే... 'నాకు ఇతర నటీనటులతో కలిసి నటించడం అంతే ఎంతో ఇష్టం. నేను నటించాలని కోరుకుని, అలా నటించని నటుడు ఒకరు ఉన్నారు. ఆయనే దిలీప్ కుమార్ సర్. నేను 'తేవర్ మగన్' అనే సినిమాను హిందీలో రీమేక్ చేద్దామని అనుకున్నాను. అందులో నాతో కలిసి నటించమని కోరేందుకు ఆయన్ను కలిశాను. దిలీప్ కుమార్ (Dilip Kumar)చేతులు పట్టుకుని మరీ ఆ సినిమాలో నటించాలని ప్రాధేయపడ్డా. కానీ ఆయన ఒప్పుకోలేదు.' అని కమల్ హాసన్ తెలిపారు.
1992లో విడుదలైన తేవర్ మగన్ మూవీ తెలుగులో క్షత్రియ పుత్రుడు టైటిల్ తో విడుదలైంది. తెలుగులో ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. హిందీలో అనిల్ కపూర్, అమ్రిష్‌పురి కాంబినేషన్లో 'విరాసత్'గా తెరకెక్కించారు. తమిళంలో శివాజీ గణేశన్ చేసిన పాత్ర అమ్రీష్ పురి చేశారు. ఆ పాత్ర కోసమే దిలీప్ కుమార్ ని కమల్ హాసన్ సంప్రదించడం జరిగింది. అప్పట్లో సౌత్ సినిమాపై నార్త్ వాళ్లకు మరింత చిన్న చూపు ఉండేది. ఆయన అంగీకరించక పోవడానికి ఇది కూడా కారణం కావచ్చు.
ఇక కమల్ లేటెస్ట్ మూవీ విక్రమ్ (Vikram) జూన్ 3న పలు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక రోల్స్ చేస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. విక్రమ్ ట్రైలర్ ఆకట్టుకోగా మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.