మూడు దశాబ్దాల క్రితమే బాలీవుడ్ స్టార్స్ కి షాక్ ఇచ్చాడు చిరు. దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ గా అవతరించాడు. అమితాబ్ నే మించేసిన చిరంజీవి అంటూ అప్పట్లో ప్రచురితమైన కథనం ఓ సెన్సేషన్. 

90ల ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ పీక్స్ చేరింది. వరుస బ్లాక్ బస్టర్స్ తిరుగులేని స్టార్ గా నిలబెట్టాయి. జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. దీంతో చిరంజీవి డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. ఆయన కోసం నిర్మాతలు క్యూకడుతున్నారు. చిరంజీవి డేట్స్ దొరకడమంటే కోహినూర్ వజ్రం దొరికినట్లే. ఆ టైం లో చిరంజీవి రెమ్యూనరేషన్ దేశంలోనే హైయెస్ట్ కి చేరుకుంది. 

1992లో చిరంజీవి (Chiranjeevi)అత్యధికంగా ఓ చిత్రానికి రూ. 1.25 కోట్లు తీసుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. ఓ నేషనల్ మీడియా చిరంజీవి కవర్ పేజీతో ఆర్టికల్ ప్రచురించింది. ది వీక్ మ్యాగజైన్ కథనం ప్రకారం చిరంజీవి బాలీవుడ్ స్టార్ అమితాబ్ కంటే అధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటూ కథనం ప్రచురించింది. 1992లో సెప్టెంబర్ లో ఈ ఆర్టికల్ ది వీక్ ఎడిషన్ లో రాయడం జరిగింది. ఆ టైం లో షారుక్, సల్మాన్ స్టార్స్ గా ఎదుగుతున్నారు. అమితాబ్ అప్పటికి కూడా దేశంలోనే అతిపెద్ద స్టార్ గా ఉన్నారు. 

1992లో అమితాబ్ (Amitabh Bachchan) పారితోషికం కోటి రూపాయలకు అటూ ఇటుగా ఉన్నట్లు సమాచారం. అలాంటి అమితాబ్ ని కూడా అధిగమిస్తూ ప్రాంతీయ చిత్రాల హీరో చిరంజీవి కోటికి పైగా అందుకోవడం సెన్సేషనల్ న్యూస్ అయ్యింది. చిరంజీవి సెట్ చేసిన ఆ రికార్డు ఇప్పటి మన స్టార్స్ రిపీట్ చేస్తున్నారు. ప్రభాస్ దేశంలోనే అధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా రికార్డులకు ఎక్కారు. ఆయన అత్యధికంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. 

అలాగే బాలీవుడ్ పై టాలీవుడ్ పూర్తి ఆధిపత్యం కనిపిస్తుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వర్షన్ మొదటిరోజు రూ. 25 కోట్ల గ్రాస్ రాబట్టింది. అదే సమయంలో రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, టైగర్ ష్రాఫ్ లేటెస్ట్ చిత్రాలు కనీసం రూ. 5 కోట్ల ఓపెనింగ్స్ దక్కించుకోలేకపోయాయి. పుష్ప, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో పోటీపడిన హిందీ చిత్రాలు భారీగా నష్టపోయి అట్టర్ ప్లాప్ ఖాతాలో చేరాయి.