ప్రతి డైరెక్టర్ కథను ఓ హీరోని దృష్టిలో ఉంచుకుని రాసుకుంటాడు. అయితే అదే హీరోతో కుదరకపోవచ్చు. కాగా ఎన్టీఆర్ తో చేద్దామనుకున్న మూవీని ఒక దర్శకుడు అల్లు అర్జున్ తో చేశాడు. ఆ మూవీ బాక్సాఫీస్ పరంగా నిరాశపరిచింది.  

స్క్రిప్ట్ సెలక్షన్ మీదే విజయాలు ఆధారపడతాయి. అదే సమయంలో అదృష్టం, టైం కూడా కలిసి రావాలి. ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన హిట్ మూవీ మరో హీరో వద్దకు పోవచ్చు. అలాగే ఈ హీరో చేయాల్సిన ప్లాప్ మూవీ ఆ హీరో చేయవచ్చు. కొన్నిసార్లు సమయం దొరక్క హీరోలు ప్రాజెక్ట్స్ వదిలేస్తారు. మరికొన్నిసార్లు మనకు ఈ సబ్జెక్టు సెట్ కాదులే అని తిరస్కరిస్తారు. కాగా అల్లు అర్జున్ చేసిన ఓ ప్లాప్ మూవీ ఎన్టీఆర్ చేయాల్సింది. ఎన్టీఆర్ రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. 

ఇంతకీ ఆ చిత్రం ఏమిటంటే వేదం. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరక్కించిన గమ్యం సూపర్ హిట్. అలాగే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విషయం ఉన్న దర్శకుడిగా క్రిష్ ఇమేజ్ రాబట్టాడు. గమ్యం విడుదలైన రెండేళ్లకు వేదం టైటిల్ తో మరో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ చేశాడు. ఇది యాంథాలజీ హైపర్ లింక్ మూవీ. సమాజంలోని వివిధ మనుషులు, వారి మనస్తత్వాలు, కోరికలు, సంఘర్షణ అనే అంశాలు ప్రధానంగా సాగుతుంది. 

అల్లు అర్జున్ స్లమ్ బాయ్ రోల్ చేయగా, మంచు మనోజ్ రాక్ స్టార్ పాత్రలో అలరించాడు. ఈ చిత్రంలో అనుష్క వేశ్య పాత్ర చేయడం విశేషం. దీక్ష సేథ్ అల్లు అర్జున్ తో జతకట్టింది. మంచి చిత్రంగా పేరు తెచ్చుకున్నప్పటికీ వేదం కమర్షియల్ గా ఆడలేదు. కాగా వేదం లో అల్లు అర్జున్ పాత్రకు క్రిష్ ఎన్టీఆర్ ని అనుకున్నాడట. తన ఇమేజ్ కి సెట్ కాదని భావించిన ఎన్టీఆర్ సున్నితంగా ఈ కథను రిజెక్ట్ చేశాడు. 

అల్లు అర్జున్ కూడా అప్పటికి మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయినప్పటికీ క్రిష్ ప్రయోగానికి అల్లు అర్జున్ ఒప్పుకున్నాడు. కమర్షియల్ యాంగిల్ లేని రోల్ చేశాడు. అల్లు అర్జున్ కి వేదంతో విజయం దక్కకపోయినా పేరొచ్చింది. అల్లు అర్జున్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అదన్నమాట కథ..