Asianet News TeluguAsianet News Telugu

అల్లు రామలింగయ్యకు వేషాలివ్వద్దని దర్శకులకు చెప్పిన అల్లు అరవింద్.... దర్శకేంద్రుడు బయటపెట్టిన చేదు నిజం!

తండ్రి అల్లు రామలింగయ్యకు వేషాలు ఇవ్వొద్దని అల్లు అరవింద్ దర్శకులకు చెప్పేవాడట. అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ నిజాన్ని బయటపెట్టారు. 
 

when allu aravind asked directors not to offer roles to his father allu ramalingaiah
Author
First Published Dec 3, 2022, 1:50 PM IST

అల్లు ఫ్యామిలీ టాలీవుడ్ లో వటవృక్షం గా ఎదిగింది. దానికి బీజం వేసింది అల్లు రామలింగయ్య. స్టార్ కమెడియన్ గా అల్లు రామలింగయ్య దశాబ్దాల పాటు వెండితెరపై నవ్వులు పూయించారు. ఆయన కుమారుడు అల్లు అరవింద్ నిర్మాతగా మారి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. రామలింగయ్య మనవడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. తరాల వారీగా అల్లు ఫ్యామిలీ కీర్తి విస్తరిస్తూ వస్తుంది. 

దానికి పునాది వేసిన అల్లు రామలింగయ్యకు కొడుకు అల్లు అరవింద్ అవకాశాలు రాకుండా చేశాడంటే నమ్మకం కష్టమే. కానీ ఇదే నిజం. ఈ పచ్చి నిజాన్ని సీనియర్ దర్శకులు కే రాఘవేంద్రరావు బయటపెట్టారు. అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ కి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, దర్శకుడు కే రాఘవేంద్రరావు గెస్ట్స్ గా వచ్చారు. రాఘవేంద్రరావుకు బాలయ్య,సురేష్ బాబు, అల్లు అరవింద్ తండ్రులైన ఎన్టీఆర్, రామానాయుడు, అల్లు రామలింగయ్యతో అనుబంధం ఉంది. వారితో ఆయన జర్నీ ఏళ్ల తరబడి సాగింది. 

ఈ క్రమంలో బాలకృష్ణ మా తండ్రులు మా గురించి మీకు ఏమి చెప్పారో చెప్పాలని కోరారు. దానికి అల్లు అరవింద్ ని వాళ్ళ నాన్న నానా తిట్లు తిట్టేవాడు. అల్లు అరవింద్ నా వద్దకు వచ్చి... ఇది మా ఫ్యామిలీ మేటర్. మీరు నాన్నకు వేషాలు ఇవ్వకండి. ఆయనకు వయసు పైబడింది, అని చెప్పి వెళ్లేవారట. అల్లు అరవింద్ వెళ్ళిపోయిన కాసేపటికి అల్లు రామలింగయ్య రాఘవేంద్రరావు దగ్గరకు వచ్చేవాడట. వేషం లేదని చెబితే... ఏంటి మా వాడు వచ్చాడా? నాకు తెలుసు వాడే నాకు వేషం ఇవ్వొద్దని చెప్పి ఉంటాడని, అల్లు అరవింద్ ని తిట్టేవాడట. 

గతంలో జరిగిన ఈ విషయం చెప్పి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు నవ్వులు పూయించారు. ఇక రామానాయుడు వాళ్ళ అబ్బాయి సురేష్ బాబుకు ధైర్యం లేదని అసహనం వ్యక్తం చేసేవాడట.  ఇక ఎన్టీఆర్ ఒక వేషం గురించి బాలయ్య పట్ల నిరాశ చెందారట. రాఘవేంద్రరావు బాలయ్య, సురేష్ బాబు, అల్లు అరవింద్ ఫాదర్స్ ఏం చెప్పారో బయటపెట్టారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios