హలో, ఎంసిఏ ఎలా ఉండబోతున్నాయి..?

First Published 20, Dec 2017, 10:57 AM IST
what would be the fate of Hello and MCA
Highlights

బాక్సాఫీస్ డల్ గా ఉన్నపుడు ఈ రెండు సినిమాలు హుశారెక్కిస్తాయంటున్నారు.

ఈ నెలలో వచ్చిన సినిమాల్లో చెప్పుకునే స్థాయిలో ఒక్క సినిమా కూడా విజయాన్ని అందుకోలేదు. 

గతవారం ఏకంగా 13 సినిమాలు విడుదలయ్యాయి. కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. దీంతో బాక్సాఫీస్ కాస్త డల్ అయింది. అయితే ఈ వారం రాబోతున్న రెండు సినిమాలపై అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ముందుగా గురువారం నాని నటించిన 'ఎంసిఏ' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. దిల్ రాజు ప్రేక్షకుల ధోరణిలో ఆలోచిస్తాడు. కథ, కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే.. సినిమాలో ఒక్క సీన్ తనకు నచ్చకపోయినా సహించడు. మళ్ళీ రీషూట్ చేయాల్సిందే. అందుకే ఆయన సినిమాలంటే ప్రేక్షకుల్లో ఒకరకమైన నమ్మకం. పైగా సినిమాలో నాని హీరో కావడం మరిన్ని అంచనాలను పెంచుతుంది. ఇక 'ఫిదా' సినిమాతో అందరికీ కలల రాణిగా మారిపోయింది సాయి పల్లవి. 

ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్ కలిసి నటించిన సినిమా కావడంతో సినిమా చూడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఇక ల్యాబ్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే ఉంది. సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల స్లోగా ఉన్నప్పటికీ ఓవరాల్ గా సినిమాకు మంచి టాక్ రావడం ఖాయమంటున్నారు. ఇక అఖిల్ నటించిన 'హలో' సినిమా ల్యాబ్ రిపోర్ట్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. యాక్షన్ తో కూడిన లవ్ స్టోరీ ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని అంటున్నారు. విక్రమ్ టేకింగ్ సినిమా స్థాయిని పెంచిందని టాక్. క్లైమాక్స్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తుందని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే రెండు సినిమాలు హిట్ అవ్వడం గ్యారంటీ అన్నమాట!

 

 ఇది కూడా చదవండి

దిల్ రాజుకు పవన్ ఇచ్చిన మాట ఏమిటో తెలుసా

https://goo.gl/Rw6BNw

loader