తెలుగు సినీ పరిశ్రమలో అన్యోన్య దంపతులుగా రామ్ చరణ్ ఉపాసనలు రామ్ చరణ్ పై ఉపాసనకు కోపం వస్తే.. ఏం జరుగుతుందో తెలుసా.. చెర్రీపై ఉపాసనకు కోపం వస్తుందే.. వస్తే ఏంచేస్తుందో ఉపాసన చెప్తోంది.

టాలీవుడ్ లో అన్యోన్యంగా వుంటున్న దంపతులెవరా.. అంటే ఫస్ట్ గుర్తొచ్చే జంట ఉపాసన-రామ్ చరణ్. మెగా కోడలు ఉపాసన అంటే కుటుంబం ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో పలు సందర్భాల్లో తను చెప్పింది. భర్త రామ్ చరణ్ పై తనకు కోపం వస్తుందా.. అంటే ఎంతైనా.. భార్యభర్తలు ఎంతటివారైనా గొడవలేవో వుంటాయి కదా.. అందుకే ఎప్పుడైనా రామ్ చరణ్ పై కోపం వస్తే... ఉపాసన ఏం చేస్తుందో తెలుసా. అయితే తనేం చెప్తుందో మీరు తెలుసుకోవాలి.

రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులిద్దరూ వృత్తి పరంగా ఎంత బిజీగా ఉన్నా ఉపాసన తన భర్త చరణ్‌ని ముద్దుగా ‘మిస్టర్‌.సి’ అని సంబోధిస్తూ సోషల్‌మీడియాలో ఫొటోలు పెడుతూ అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తుంటారు. చరణ్‌ కూడా తన భార్యని ప్రేమగా ‘ఉప్సీ’ అని పిలుస్తూ ఫొటోలు పోస్ట్‌ చేస్తుంటారు.

తాజాగా ఉపాసన.. చరణ్‌ చిన్ననాటి ఫొటో ఒకటి తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. చరణ్‌పై తనకు కోపం వచ్చినప్పుడు ఈ ఫొటో చూస్తుంటానని సరదాగా పేర్కొన్నారు. ‘మిస్టర్‌.సి పై నాకు కోపం వచ్చినప్పుడు ముద్దొస్తున్న ఈ ఫొటో చూస్తాను. అంతే..ఆ ఫొటో చూశాక నా మనసు కరిగిపోతుంది’ అని ట్వీట్‌ చేశారు. ఉపాసన చెప్పినట్లుగానే చరణ్‌ నిజంగా ఈ ఫొటోలో చాలా ముద్దుగా ఉన్నారు. రామ్ చరణ్ ప్రస్థుతం రంగస్థలం,సైరా సినిమా పనుల్లో బిజీగా వున్నారు.

Scroll to load tweet…