తన కొత్త బాయ్  ఫ్రెండ్ తో షికార్లు చేస్తూ.. మీడియాకి చిక్కేసింది బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్.  తొలుత తన సహనటుడు ఆదిత్యరాయ్ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. తర్వాత ఏమైందో ఏమో.. వీరి ప్రేమకు బ్రేకులు పడ్డాయి. తర్వాత వరస సినిమాలతో దూసుకుపోతూ.. స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.  కాగా.. ఇటీవల శ్రద్ధా ఫోటో గ్రాఫర్ తో ప్రేమలో పడిందని బాలీవుడ్ కోడై కూస్తోంది.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్టతో శ్రద్ధా డేటింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ అర్థరాత్రి రోడ్డుపై షికార్లు చేస్తూ.. మీడియా కంటికి చిక్కారు. ఇంకేముంది.. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ 9 సంవత్సరాలుగా పరిచయం ఉందని తెలుస్తోంది. కాగా.. కొద్ది నెలల క్రితం నుంచే వీరు డేటింగ్ మొదలుపెట్టారట. 

ఈ ఏడాది కరణ్  జోహార్ ఏర్పాటు చేసిన దీవాళి బాష్ కి కూడా శ్రద్ధా.. రోషన్ తో కలిసి హాజరైంది. ప్రస్తుతం శ్రద్ధా.. ప్రభాస్ సరసన సాహోలోనూ, సైనా నెహ్వాల్ బయోపిక్ లోనూ నటిస్తోంది.