Asianet News TeluguAsianet News Telugu

‘పొన్నియిన్ సెల్వన్ 1’ రన్ టైం ఎంత? సరిగ్గా ‘బాహుబలి’నే ఫాలో అయ్యారుగా.?

భారీ బడ్జెట్ తో తమిళంలో రూపొందించిన చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan). ప్రస్తుతం చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలో తాజాగా మూవీ రన్ టైమ్ కూడా రిలీల్ అయ్యింది. 

What is the run time of Ponniyin Selvan 1 Movie? Did they follow exactly Baahubali?
Author
First Published Sep 24, 2022, 5:21 PM IST

కోలీవుడ్ లో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్ 1’ (Ponniyin Selvan 1) రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ కూడా సినిమాపై భారీ హైప్ ను క్రియేట్ చేస్తోంది.  ప్రముఖ తమిళ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. కోలీవుడ్ బడా స్టార్స్ చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్లుగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్, త్రిష, శోభితా దూళిపాళ అలరించబోతున్నారు. 

ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ ను మాత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ టీం జోరుగా నిర్వహిస్తోంది. ఎక్కడా తగ్గకుండా భారీ చిత్రాన్ని అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యేలా చేస్తున్నారు.  ఈ క్రమంలో తాజాగా చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ అందింది. చిత్ర రన్ టైం రివీల్ అయ్యింది. సేమ్ బాహుబలి పార్ట్ 2 మాదిరిగానే కనిపిస్తోంది. తాజాగా సమాచారం ప్రకారం.. ‘పొన్నియిన్ సెల్వన్ 1’ రన్ టైం 167 నిమిషాలు అనగా 2 గంటల 47 నిమిషాలుగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే గతంలో ఎస్ఎస్ రాజమౌళి -ప్రభాస్ కాంబోలో  వచ్చిన ‘బాహుబలి 2) (Baahubali 2) కూడా 2 గంటల 47 నిమిషాలే ఉండటం విశేషం. ఇప్పటికే ‘పొన్నియిన్ సెల్వన్’ బాహుబలి మాదిరిగానే ఉంటుందా అని  అంటున్నారు. ఈ క్రమంలో రన్ టైమ్ మ్యాచ్ కావడం ఆసక్తికరంగా మారింది. 

తొలిసారిగా తమిళ ఇండస్ట్రీలో ముగ్గురు బడా హీరోలు, స్టార్ డైరెక్టర్ కాంబినేషనల్ లో బిగ్ ప్రాజెక్ట్ థియేటర్లలోకి రాబోతుండటంతో ప్రేక్షకులు ఎగ్జైట్ గా ఫీలవుతున్నారు. మరోవైపు చిత్ర కథ కూడా సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తోంది. దక్షిణ భారతదేశాన్ని పాలించిన అరుల్మొళివర్మన్,  చోళ చక్రవర్తి కాలం నాటి కథను ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొస్తున్నారు. ఇప్పటికే చిత్రం  నుంచి వచ్చిన  పోస్టర్లు, పాటలు, గ్లింప్స్, ట్రైలర్ కు ఆడియెన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. చిత్రంలోని భారీ యుద్ధ సన్నివేశాలు, సముద్రంలో ప్రయాణించే నౌకలకు సంబంధించిన షాట్స్ సినిమాపై అంచనాలను  పెంచుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios