అఖిల్ రెమ్యూనరేషన్ ఎంత..?

First Published 19, Dec 2017, 7:55 PM IST
What is the remuneration Akhil takes from producers
Highlights

నాగార్జున అఖిల్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనేది అంతా అడుగుతున్న ప్రశ్న

అక్కినేని అఖిల్ నటించిన మొదటి సినిమా 'అఖిల్' ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ తన రెండో సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో పూర్తి చేసేశాడు. అదే 'హలో'. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు అఖిల్, నాగార్జున. అఖిల్ ఈ సినిమా విషయంలో చాలా కష్టపడుతున్నాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ ఏ ఒక్కదాన్ని కూడా లైట్ తీసుకోవడం లేదు.

రీసెంట్ గా అమెరికా వెళ్ళి అక్కడ లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన అఖిల్ హైదరాబాద్ లో జరగనున్న ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూడా లైవ్ పెర్ఫార్మన్స్ చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగార్జున అఖిల్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారనే ప్రశ్న మొదలైంది. ఈ విషయంపై స్పందించిన నాగార్జున ఒక్క పైసా కూడా ఇవ్వలేదని సినిమా హిట్ అయితే రూ.2 కోట్ల రూపాయలు అఖిల్ కు అందుతాయని అన్నారు. అది కూడా గిఫ్ట్ రూపంలో అని స్పష్టం చేశారు. రెండు కోట్ల విలువైన ఇంపోర్టెడ్ కార్ ను అఖిల్ కు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నారు నాగార్జున. 

loader