మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాల్లో విడుదలకు సిద్ధమవుతున్న మరో చిత్రం ‘మెగా154’ (Mega 154). చిత్రాన్నిమేకర్స్ సాధ్యనమైంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా క్రేజీ అప్డేట్ అందించారు.
మెగా స్టార్ చిరంజీవి (Chirnjeevi) రీసెంట్ గా ‘గాడ్ ఫాదర్’తో ఫ్యాన్స్ ను, ప్రేక్షకులను ఖుషీ చేశారు. ఈ చిత్రం ఇంకా సక్సెస్ మీట్లను జరుపుకుంటుండగానే.. అటు ‘మెగా 154’పైనా చిరంజీవి ఫోకస్ పెట్టారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేశారు. అలాగే చిత్రీకరణ దాదాపుగా పూర్తైనట్టు తెలుస్తోంది. ‘మెగా154’ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చాలా గ్రాండ్ గా సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంటున్న యూనిట్ సినిమా నిర్మాణంలో తాజాగా మరో మెట్టు ఎక్కింది. ఈ మేరకు అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు.
తాజా అప్డేట్ ప్రకారం.. ఈరోజు ‘మెగా154’కు సంబంధించిన డబ్బింగ్ ప్రారంభానికి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు బాబీ, చిత్ర యూనిట్ పాల్గొని డబ్బింగ్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అదేవిధంగా ఫ్యాన్స్ కోసం ‘మాసీవ్ అప్డేట్స్’ను కూడా సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే అప్డేట్స్ కు పూనకాలే అంటూ హామీనిస్తున్నారు. దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు చిత్రం టైటిల్ ను అఫిషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ ను గతంలోనే అనధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు టీజర్ ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.
‘గాడ్ ఫాదర్’ బ్రహ్మండమైన విజయం సాధించడంతో తదుపరి చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Valtheru Veeraiah)పైనా అంచనాలు పెరుగుతున్నాయి. చిత్రంలో మెగాస్టార్ ను బాబీ వింటేజ్ లుక్ లో చూపించబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్ గా విడుదలైన చిరు లుక్స్ కూడా అదే సూచిస్తున్నారు. మాస్ యాంగిల్లో అన్నయ్య కుమ్మేసాడని అంటున్నారు. చిరు సరసన గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
