కళ్యాణ్ దేవ్ శ్రీజల విడాకుల మీద ఇంత వరకు అయితే అఫీషియల్ గా క్లారిటీ రాలేదు. ఏ విషయంలో ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చి వీరి వ్యవహారం ఇంత వరకు
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ రెండో భర్త కల్యాణ్ దేవ్ తన సినిమాల కన్నా పర్శనల్ విషయాల గురించే ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నారు. ఆయన విడాకుల విషయం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం వీరిద్దరు కూడా కలిసి ఉండటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరు పెట్టే పోస్టులే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కళ్యాణ్ దేవ్ తో శ్రీజ డివోర్స్ తీసుకుందంటూ ఆన్ లైన్ వేదికపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా ఈ ఇష్యూపై మెగా ఫ్యామిలీ రియాక్ట్ అయ్యింది లేదు. దీంతో శ్రీజ డివోర్స్ నిజమే అని జనం నమ్ముతున్నారు. మొదటగా శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల నుండి కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వీరిద్దరి విడాకుల రూమర్స్ మొదలు అయ్యాయి. అలాగే కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం ఈ వార్తలకి బలాన్నిచ్చింది.
ఇక తాజాగా జరిగిన కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు వేడుకలకు తన కూతురు నవిష్క వచ్చింది. తన బర్త్ డే సందర్భంగా తన కూతురు నాలుగో పుట్టిన రోజు వేడుకలను కూడా సెలెబ్రేట్ చేసుకున్నాడు కళ్యాణ్ దేవ్. ఇంత కంటే గొప్ప బహుమతి నాకు ఇంకెక్కడా దొరకదు అంటూ తన బర్త్ డే నాడు కూతురితో ఆడుకుంటూ చెప్పుకొచ్చాడు కళ్యాణ్ దేవ్.
ఇక కళ్యాణ్ దేవ్ శ్రీజల విడాకుల మీద ఇంత వరకు అయితే అఫీషియల్ గా క్లారిటీ రాలేదు. ఏ విషయంలో ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చి వీరి వ్యవహారం ఇంత వరకు వచ్చిందనేది తెలియలేదు. విడాకులు తీసుకునేంతగా ఏమై ఉంటుందంటూ సోషల్ మీడియా జనం డిస్కషన్స్ పెట్టేసారు. తాజాగా కళ్యాణ్ దేవ్ వేసిన పోస్ట్ చూస్తుంటే.. పరోక్షంగా తాను ఎందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పకనే చెప్పినట్టుగా అనిపిస్తుందంటున్నారు. ఆ పోస్ట్ లో ..
ఎదుటి వాళ్లు మనల్ని ఎంతగా లైక్ చేస్తున్నారనేది ముఖ్యం కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ కళ్యాణ్ దేవ్ ఓ కొటేషన్‌ను షేర్ చేశాడు. దీంతో కళ్యాణ్ దేవ్‌కు మెగా ఇంట్లో అవమానం జరిగిందా? అందుకే విడిపోయాడా? దూరంగా ఉంటున్నాడా? అంటూ జనం మాట్లాడుతున్నారు.
శ్రీజతో విభేదాలు అనే మ్యాటర్ బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు మెగా ఫ్యామిలీ సప్పోర్ట్ ఉండకపోవడం, చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలను ప్రమోట్ చేయకపోవడం జరిగింది. చాలా రోజులుగా కల్యాణ్ దేవ్ తన భార్య, కూతురుకు దూరంగా ఉంటున్నాడు. అటు శ్రీజ తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ పేరును కొద్ది కాలం కిందటే శ్రీజ కొణిదెలాగా మార్చుకుంది. భర్త కల్యాణ్ దేవ్ ను అన్ ఫాలో చేసింది. ఈ నేపథ్యంలో వారి గురించి వస్తున్న వార్తలు వాస్తవమేనని తేలాయి. అంతేకాదు, మెగా ఫ్యామిలీలో జరిగే ఎలాంటి వేడుకలకు కల్యాణ్ దేవ్ హాజరుకావడం లేదు.
