పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ మూవీ అప్డేట్స్ గురించి ఎదురుచూస్తున్నారు.  ఈ క్రమంలో చిత్ర యూనిట్  స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది.  

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంబినేషన్ లో వస్తున్న హిందూ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధమవుతోంది. 
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలిసారిగా డైరెక్ట్ హిందీ ఫిల్మ్ లో నటిస్తుండటం పట్ల ప్రభాస్ అభిమానులు, తెలుగు ఆడియెన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. 

గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ గతేడాది నవంబర్ లోనే పూర్తయ్యింది. షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయి ఇప్పటికీ ఆరేడు నెలలు గడుస్తున్నా ఇంకా ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఇటు అభిమానులు, అటు ఆడియెన్స్ చిత్ర యూనిట్ పై కాస్తా గరం అవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియా వేదికన పలుమార్లు ఆదిపురుష్ అప్డేట్స్ ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ లైనప్ లో పెట్టిన ప్రాజెక్ట్ లో ‘రాధే శ్యామ్’ తర్వాత రిలీజ్ కావాల్సింది ‘ఆది పురుష్’నే. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం నుంచి అప్డేట్స్ రాకపోవడంతో అప్సెట్ అవుతున్నారు. 

దీన్ని గుర్తించిన మేకర్స్ Adipurush చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో స్పీడ్ పెంచినట్టు తెలుస్తోంది. గత అప్డేట్ ప్రకారం.. అక్టోబర్ లో ఫస్ట్ లుక్ లేదా టీజర్ రానుందని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆదిపురుష్ టీం కాస్తా జోరు పెంచిందంట. అంతకంటే ముందే ప్రమోషనల్ వీడియో లేదా టీజర్ అయినా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ లోని పలు సీన్లను డైరెక్టర్, స్టార్ కాస్ట్ పరిశీలించిన విషయం తెలిసిందే. 

హిందూ మైథలాజికల్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్’ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నారు. రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ పలు కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. హిందీ, తెలుగులో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మిగతా భాషల్లో నూ రిలీజ్ కానుంది. మరోవైపు ప్రభాస్ నిర్విరామంగా Salaar మరియు Project K చిత్రాలను ప్యార్లల్ గా పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈరోజే సలార్ సెట్స్ నుంచి ప్రాజెక్ట్ కే సెట్ లో జాయిన్ అయినట్టు సమాచారం.