యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో ఆగష్టు 30న గ్రాండ్ రిలీజ్ కు అంతా సిద్ధం చేసుకుంది. ప్రభాస్, శ్రద్దా కపూర్ ఇండియా మొత్తం తిరుగుతూ సాహో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బుల్లి తెరపై ఫేమస్ అయిన 'నచ్ బలియే ', కపిల్ శర్మ షోలకు ప్రభాస్, శ్రద్దా కపూర్ హాజరయ్యారు. 

కపిల్ శర్మ షోకు ప్రభాస్, శ్రద్దాతో పాటు సాహోలో కీలక పాత్రలో నటిస్తున్న నీల్ నితిన్ ముఖేష్ కూడా హాజరయ్యాడు. సెలెబ్రిటీలందరిపై జోకులు వేసే కపిల్ శర్మ.. ప్రభాస్, శ్రద్దా కపూర్ లని కూడా వదల్లేదు. శ్రద్దా కపూర్ కు ఓ వింత సమస్య ఉంది.. ప్రతి సినిమా రిలీజ్ డే రోజు ఆమె స్టమక్ అప్సెట్ అవుతుంది అని కపిల్ అన్నాడు. దీనికి నిజమే అని శ్రద్దా ఒప్పుకుంది. 

ప్రభాస్ ని కపిల్ శర్మ ఓ ఫన్నీగా ఓ ప్రశ్న అడిగాడు. ఒక్క రోజు ఈ దేశానికి ప్రధాని అయ్యే ఛాన్స్ వస్తే ఏం చేస్తావు అని అడగగా.. దేశం మొత్తం ఫిలిం సెలెబ్రిటీల ఇంటర్వ్యూలు ఆపేస్తా అని బదులిచ్చాడు. ప్రభాస్ ఆన్సర్ అందరిలో నవ్వులు పూయించింది. సాహో కోసం ప్రభాస్ తీరిక లేకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. 

సౌత్ లో ప్రభాస్ ని యంగ్ రెబల్ స్టార్ అంటారు అని కపిల్ శర్మ షోలో ఆడియన్స్ కు తెలిపాడు. దాని గురించి కపిల్ శర్మ ప్రభాస్ ని అడగగా.. మా పెదనాన్నని రెబల్ స్టార్ అంటారు. నేను యంగ్ కాబట్టి యంగ్ రెబల్ స్టార్ అని ఫ్యాన్స్ పిలుస్తున్నట్లు ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు.