అతిలోక సుందరి శ్రీదేవి దుబయిలోని ఓ హోటల్ లో మరణించటంతో భారత చలన చిత్ర పరిశ్రమకు ఫిబ్రవరి 24, 2018 తేదీ ఓ కాళరాత్రిగా మిగిలిపోయింది. ఐదు దశాబ్దాలుగా వెండితెరపై వెలుగొంది విశేష అభిమానాన్ని చూరగొన్న శ్రీదేవి హోటల్‌లోని బాత్రూం టబ్‌లో మునిగి చనిపోయారనే వార్తపై పలు సందేహాలు వ్యక్తమయ్యాయి.  శ్రీదేవి మరణంపై రకరకాల విశ్లేషణలు సాగాయి. ఇంకా సాగుతున్నాయి. తాజాగా ఆమిర్ ఖాన్ కూడా కొత్త వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం శ్రీదేవి కేవలం బీపీ లెవెల్స్ లో హెచ్చుతగ్గులవల్లే... మరణించిందని ఆమిర్ బోనీ కపూర్ కు వివరించారు. ఇలా రకరకాల వాదనలు,, విశ్లేషణలు ఇంకా కొనసాగుతున్నాయి.

 

మరోవైపు శ్రీదేవి మరణం వెనుక మరేదైనా కోణం ఉందా? అనే సందేహాలకు భారత విదేశాంగ శాఖ ఫుల్ స్టాప్ పెట్టింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ,  శ్రీదేవి మృతిపై యూఏఈ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి నివేదిక అందిందని తెలిపారు. ఒకవేళ శ్రీదేవి మృతి వెనుక అనుమానించదగ్గ అంశాలు ఏమైనా ఉంటే ఇప్పటికల్లా బయటకు వచ్చేవని చెప్పారు. ఇక ఈ విషయంపై ఎలాంటి చర్చ అవసరం లేదని తెలిపారు.

 

మరో వైపు శ్రీదేవి పార్థివ దేహం ముంబై చేరుకోవటంలో అనిల్ అంబానీ కృషి కూడా తెలిసిందే. ప్రత్యేకంగా తన జెట్ విమానాన్ని పంపి వీలైనంత త్వరగా మృతదేహం ముంబై చేరుకునేలా చేశారు. అంతేకాక అనిల్ అంబానీ అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీంతో మాట్లాడి దుబయి అధికారులను ప్రభావితం చేయించి త్వరగా శ్రీదేవి మృతదేహం ముంబై చేరుకునేలా చేశారని, లీగల్ గా ఎలాంటి సమస్యలు లేకుండా చూసేలా.. దావుద్ చక్రం తిప్పాడని చర్చ జరుగుతోంది. అయితే అనిల్ అంబానీ శ్రీదేవి మృతదేహాన్ని భారత్ కు రప్పించటంలో తన వవంతు కృషి చేసినా... దావుద్ తో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడలేదని, అసలు అతనితో ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.