Asianet News TeluguAsianet News Telugu

#Prabhas:రాజా...నసొద్దు..ఉందా... లేదా?విషయం చెప్పు

ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే", ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" వంటి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. 

What About Prabhas Raja Deluxe?
Author
First Published Oct 4, 2022, 1:40 PM IST


ఇప్పుడు అందరి దృష్టీ ప్రభాస్ మీదే ఉంది. ముఖ్యంగా నేషనల్ మీడియా..ప్రభాస్ తాజా చిత్రం ఆదిపురుష్ మీదా, అతని కెరీర్ లో వచ్చే సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రభాస్ తదుపరి చిత్రాలు గురించి కధనాలు వండి వారుస్తోంది. ఆ క్రమంలో ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! అయితే ఇప్పుడా సినిమా ఉందా..ఉంటే ఎప్పుడు ప్రభాస్ డేట్స్ ఇస్తాడు అనే విషయం హాట్ టాపిక్ గా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయి. 

మరికొందరైతే ఇంకాస్త ముందుకు వెళ్లి ఈ సినిమా ఉందా లేదా..లేదని తెలుగులో అంటున్నారు అంటూ నార్త్ అభిమానులు క్వచ్చిన్స్ వేస్తున్నారు. అంతేకాదు మారుతి గత చిత్రాలను వారు షేర్ చేస్తున్నారు. నిజంగానే ఈ దర్శకుడుతో ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నారా అంటూ ఆశ్చర్యపోతూ పోస్ట్ లు పెడుతున్నారు. అయితే మారుతి లో రైటింగ్ పవర్, ఆయన ఇచ్చిన సూపర్ హిట్స్,నీట్ గా సాగే భలే భలే మొగాడివోయ్, ప్రేమ కథా చిత్రమ్ వంటి సినిమాలుని వారు తెలియటం లేదు.

మరో ప్రక్క  ఈ సినిమా పాతబడ్డ రాజా డీలక్స్‌ అనే థియేటర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తాతామనవళ్ల కథ అని ఫిలింనగర్‌లో వినిపిస్తోంది. ఈ చిత్రం షూటింగ్‌ కోసం ఆల్‌రెడీ హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో థియేటర్‌ సెట్‌ను రెడీ చేస్తున్నారట చిత్రయూనిట్‌. అలాగే వీలైనంత త్వరగా రెండు షెడ్యూల్స్‌లోనే షూటింగ్‌ను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట మారుతి.

హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్‌లో ప్రభాస్‌ త్వరలోనే జాయిన్‌ కానున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది ఒక పతబడిపోయిన థియేట‌ర్ నేప‌థ్యంలో సాగే క‌థ‌ అని సమాచారం. బొమ‌న్ ఇరానీని సినిమాలో ఓ కీల‌క పాత్ర చేయనున్నట్టు స‌మాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టలెక్కే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్", నాగ్ అశ్విన్ డైరెక్షన్లో "ప్రాజెక్ట్ కే", ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్", సందీప్ వంగా డైరెక్షన్లో "స్పిరిట్" వంటి సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. కాగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ఆదిపురుష్‌ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ రీసెంట్ గా రిలీజైంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios