అసలు బంగార్రాజు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం టార్గెట్ ఎంత అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమా విడుదల తేదీ ఖరారు చేసారు. జనవరి 14న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాను సంక్రాంతికే తీసుకొస్తామని చిత్ర టీమ్ ఎప్పటి నుంచో చెప్తున్నా విడుదల తేదీని ఖరారు చేయకపోవడంతో రకరకాల రూమర్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో చిత్ర టీమ్ ప్రెస్‌మీట్ నిర్వహించి విడుదల తేదీని ప్రకటించింది. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్ సినిమాలు సంక్రాంతికు రాకుండా ప్రక్కకు వెళ్లిన నేపధ్యంలో ఆ ప్లేస్ లో వస్తున్న పెద్ద సినిమాగా ఈ సినిమా క్రేజ్ తెచ్చుకుంటోంది. అయితే ఆ క్రేజ్ ఏ స్దాయి కలెక్షన్స్ తెచ్చిపెడుతుంది. కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేైపధ్యంలో ఈ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడనుంది. అసలు బంగార్రాజు చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత అయ్యింది. భాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం టార్గెట్ ఎంత అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కు సూపర్ హిట్ టాక్ వస్తేనే వర్కవుట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమాకు 40 కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది. ఓ ప్రక్కన వరసగా పెద్ద సినిమాలు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకోవడంతో సడెన్ గా సీన్ లోకి చిన్న సినిమాలు వచ్చేశాయి. దాదాపుగా 10 సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. అజిత్ వలిమై తెలుగు డబ్బింగ్ సైతం వస్తోంది. అయితే వీటిల్లో కొద్దో గొప్పో క్రేజ్ ఉన్న ప్రాజెక్టు బంగార్రాజు అనటంలో ఏ సందేహం లేదు. అయితే యావరేజ్ టాక్ తో నలభై కోట్లు మార్క్ దాటటం కష్టం. సూపర్ హిట్ టాక్ రావాలి, జనం కోవిడ్ కు భయపడకుండా థియోటర్స్ కు వెళ్లాలి. ఇక డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఇప్పుడున్న పరిస్దితుల్లో ఈ సినిమాపై ఎక్కువ నమ్మకాలు అయితే పెట్టుకోవటం లేదని అంటున్నారు.
గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ లలో కూడా ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోనూ 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు ప్రదర్శించాల్సి వస్తుంది. అందులోనూ 'బంగార్రాజు' సినిమా కోసం ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావాల్సి ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో రిస్క్ తీసుకొని సినిమాలు చూడటానికి వస్తారా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే నాగార్జున సినిమాకు కూడా సమస్యలు తప్పవనే కామెంట్స్ వస్తున్నాయి.
గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్స్. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ''బంగార్రాజు'' నుంచి ఇప్పటికే విడుదలైన- పాటలు - టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందింది.
Also Read : Megastar Praises Senapati: రాజేంద్ర ప్రసాద్ ఒక అద్భుతం.. మెగాస్టార్ చిరంజీవి ప్రశంస
