నాని..దసారాకు ప్రమోట్ చేసినట్లు వైల్డ్ గా ప్రమోట్ చేస్తే కానీ ఎవ్వరకీ సినిమా రిలీజ్ అయ్యినట్లు తెలియటం లేదు. ఎంత పెద్ద హీరోకు అయినా ఓపినింగ్స రావటం లేదు. 


అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) హీరోగా నటించిన సినిమా ‘ఏజెంట్‌’ (Agent). సురేంద‌ర్‌ రెడ్డి (Surender Reddy) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌‌గా రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియాగా తెరకెక్కింది. ఈ చిత్రం రిలీజ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా మూవీని రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ, పండగకు వరస సినిమాలు విడుదల అవుతుండటంతో ఈ చిత్రం రిలీజ్ కాలేదు. వేసవి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తాజాగా మేకర్స్ తెలిపారు. ‘ఏజెంట్‌’ విడుదల తేదీని ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. అంతవరకూ బాగానే ఉంది. రెండు పాటలు వదిలారు. అదీ బాగానే ఉంది. కానీ ఆ తర్వాత 

 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నామని చెప్పారు. అయితే సమయం దగ్గర పడుతోంది. మరో 28 రోజులే ఉంది కానీ ఎక్కడా చడీ చప్పుడూ లేదు. ప్రమోషన్స్ అసలు లేవు. మళ్లీ వాయిదా వేద్దామనే ఆలోచనలో ఉన్నారా నిర్మాతలు అనేది అభిమానులుకు వస్తున్న అనుమానం. అఖిల్ కూడా ప్రమోషన్స్ పై దృష్టి పెట్టడం లేదు. నిన్నటిదాకా క్రికెట్ మ్యాచ్ లతో కాలక్షేపం చేసిన అఖిల్ యాక్షన్ ప్లాన్ ఏంటనేది తెలియటం లేదు. ఇప్పుడున్న పరిస్దితుల్లో నాని..దసారాకు ప్రమోట్ చేసినట్లు వైల్డ్ గా ప్రమోట్ చేస్తే కానీ ఎవ్వరకీ సినిమా రిలీజ్ అయ్యినట్లు తెలియటం లేదు. ఎంత పెద్ద హీరోకు అయినా ఓపినింగ్స రావటం లేదు. అందులోనూ అంతంత మాత్రంగా ఉన్న అఖిల్ కెరీర్ కు బూస్ట్ ఇవ్వాల్సిన సినిమా ఇది. ఈ సినిమా విషయంలోనూ డల్ అయ్యితే చెయ్యగలిగేది ఏముంటుంది అంటున్నారు ఫ్యాన్స్. 

ఇప్పటికే విడుదల అయిన టీజర్ చూస్తే...గతంలో ఎప్పుడూ చూడని విధంగా అఖిల్ మేకోవర్ మార్చుకున్నాడు. యాక్టింగ్ పరిణితి, యాక్షన్ సన్నివేశాలకు తగినట్లుగా బాడీ లాంగ్వేజ్‌ కనపడుతోంది. ఈ సినిమా అఖిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు చెప్పారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా నటించారు. మమ్ముట్టి (Mammootty) ఓ కీలక పాత్రను పోషించారు. సాక్షి వైద్య ఈ మూవీతోనే టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనున్నారు. హీరోయిన్‌గా కూడా ఆమెకు ఇదే మొదటి చిత్రం. 

అఖిల్ అక్కినేని కెరీర్ విషయానికి వస్తే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ (Most Eligible Bachelor) లో చివరగా కనిపించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. బొమ్మరిల్లు బాస్కర్ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ‘ఏజెంట్’ ను పట్టాలెక్కించారు.