Asianet News TeluguAsianet News Telugu

తెరకెక్కుతోన్న చంద్రబాబు, వైయస్ స్నేహం

దాదాపు 3 దశాబ్దాలు పాటు రాజకీయ విరోధులు గా ఉన్నా ..వారి ప్రెండ్షిప్ మాత్రం కలసినప్పుడల్లా కొనసాగుతూనే ఉండేది.  ఈ విషయాలు చాలా మందికి తెలియదు. దాంతో వీరి స్నేహాన్ని , ఆ నాటి రోజులని గుర్తు చేస్తూ  ఓ వెబ్ సీరిస్ తెరకెక్కనుందని తెలుస్తోంది. 

web series on Chandrababu and YSR s friendship on the cards?
Author
Hyderabad, First Published Aug 11, 2020, 11:02 AM IST


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తలపండిన దిగ్గజాలు.. మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు.. వైయస్ రాజశేఖర్ రెడ్డి. వీరిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులు. రాజకీయంగా విభేధాలు ఉన్నా...స్నేహితులుగా బెస్ట్ అనిపించుకున్నారు. దాదాపు 3 దశాబ్దాలు పాటు రాజకీయ విరోధులు గా ఉన్నా ..వారి ప్రెండ్షిప్ మాత్రం కలసినప్పుడల్లా కొనసాగుతూనే ఉండేది.  ఈ విషయాలు చాలా మందికి తెలియదు. దాంతో వీరి స్నేహాన్ని , ఆ నాటి రోజులని గుర్తు చేస్తూ  ఓ వెబ్ సీరిస్ తెరకెక్కనుందని తెలుస్తోంది. 

`చదరంగం` వెబ్ సిరీస్ తో పాపులరైన రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా యన్టీఆర్ బయోపిక్ నిర్మాత విష్ణు ఇందూరి ఈ సినిమాని నిర్మించనున్నారు. తిరుమల రెడ్డి సహకారం అందించనున్నారు.

ఇక ఇందులో మొదట కొన్ని ఎపిసోడ్స్..వీరిద్దరి ప్రాధమిక రోజుల్లో స్నేహం ఎలా మొదలైంది..వారిద్దరి భావాలు ఎలా కలిసాయి. ఎలా స్నేహం అభివృధ్ది చెందింది చూపెడతారు. ఆ తర్వాత మెల్లిగా రాజకీయాల్లోకి వచ్చి ఎలా ఇద్దరూ ఎలా డవలప్ అయ్యారు. కాంగ్రేస్ లో ఇద్దరూ కలిసి ఎలా పనిచేసారు చూపెట్టనున్నారు. 

ఇక చంద్రబాబు నాయుడు ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా ఎదిగిన విధానం, ఆయన ప్రవేశ పెట్టిన పధకాలు, పార్టీ పరంగా వైయస్ తో విభేదాలు చూపెడతారు. ఆ తర్వాత వైయస్ ముఖ్యమంత్రి అవటం..ఆయన విధానాలు, ఆ సమయంలో ఇద్దరి మధ్య వచ్చిన పొలిటికల్ విభేధాలు, అయినా మర్చిపోని స్నేహం హైలెట్ కానున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios