ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రం నుంచి తెలుగుదేశంపార్టీ వైదొలగిన తరువాత... ఏపీకి జరిగిన అన్యాయాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లే పనిలోపడ్డారు సీఎం చంద్రబాబు. ఇందుకోసం రెండురోజులపాటు హస్తినలో మకాం వేశారు. బాబు పర్యటన సంగతి అలాఉంటే.. ఏపీ సీఎంతో హీరోయిన్ పూనమ్ కౌర్ ఢిల్లీలో సమావేశం కానుందని ఒక హాట్ న్యూస్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకీ పూనమ్, చంద్రబాబు భేటీ వెనుకున్న ఎజెండా ఏంటనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న.

 

అయితే పూనమ్‌ కోరిక మేరకు ఏప్రిల్ 4వ తేదీ అంటే ఇవాళ(బుధవారం) తనను కలవాలంటూ చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారని, తనను మోసం చేసిన ఒక ప్రముఖ వ్యక్తి గురించి ఆమె సీఎంకి ఫిర్యాదు చేయనున్నారని ఆ సోషల్ మీడియా వార్త సారాంశం. ఆ సందర్భంగా రహస్య సమాచారమున్న కొన్ని పెన్ డ్రైవ్స్ ని పూనమ్ చంద్రబాబుకు ఇవ్వనున్నట్లు కూడా చెబుతున్నారు. ఒకవేళ ఇదే గనుక జరిగితే.. ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశముంది.

 

ఒక్కసారి గతంలోకి వెళితే.. పవన్- కత్తి మహష్ ఎపిసోడ్‌లో పూనమ్ కౌర్ తెరపైకి వచ్చింది. ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశాడు ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్. నటుడు, పార్టీ అధ్యక్షుడికి ఆమెతో రిలేషన్ షిప్ వుందని ఆరోపించారు. దీనిపై పూనమ్‌ కౌర్‌ స్పందించి ట్విట్టర్‌లో కొన్ని వ్యాఖ్యలు చేసి ఆపై డిలీట్‌ చేసింది.

 

మరోవైపు కాన్సెప్ట్‌ లు కాపీ చేసి బట్టలు మార్చినట్టు మాటపై నిలబడకుండా ప్రజలను అమాయకులను చేస్తూ రాజకీయాలు చేస్తోన్న వాళ్ల గురించి భగవంతుడే నిజాలు తెలియజేయాలని కోరుకుంటున్నానంటూ ఇటీవల ఆమె చేసిన ట్వీట్ గురించి తెలిసిందే. మరి రాజకీయాల్లో పూనమ్ ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి.