మెగామేనల్లుడు సాయి తేజ్ నటించిన 'చిత్రలహరి' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. దాదాపు ఆరు సినిమాల ఫ్లాప్ ల తరువాత తేజు ఈ సినిమాలో నటించాడు. దీనిపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్ లో చేశాడు.

కానీ ఇప్పుడు విడుదలకు ముందు ఈ సినిమాకి అంత సానుకూల వాతావరణం కనిపించడం లేదు. ఆరు సినిమా ఫ్లాప్ అవ్వడంతో తేజు మార్కెట్ బాగా దెబ్బతింది. మెగాభిమానులు కూడా తేజుపై పెద్దగా ఇంటరెస్ట్ చూపించడం లేదు. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ 'చిరలహరి' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ పై కనిపిస్తోంది. ప్రస్తుతం థియేటర్లలో 'మజిలీ' సినిమా తప్ప మరొకటి లేదు.

'చిత్రలహరి' సినిమా ట్రైలర్, పాటలు బాగుండడంతో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటాయని భావించారు. కానీ బుకింగ్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి ఎలక్షన్స్ మీద ఉండడంతో సినిమాలపై పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు.

రేపటికి ఎన్నికల హడావిడి పూర్తవుతుంది కాబట్టి సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయేమోనని ఆశిస్తున్నారు. ఎన్నికల తరువాతి రోజు విడుదల కావడం ఈ సినిమాకి లాభమని సినీవిశ్లేషకులు  భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!