ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు అకిరా నందన్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా వెండితెరపై ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా మంది పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సంగతితెలిసిందే. ఇప్పటికే డాన్స్, ఏక్టింగ్ , మార్షల్ ఆర్ట్స్ లాంటి వాటిల్లో శిక్షణ తీసుకున్నాడు అకిరా. అంతేకాదు అకీరాకు సంగీతంలో కూడా ప్రావీణ్యం ఉంది. అవన్నీ పవన్ అభిమానులకు ఎప్పటికప్పుడు తెలుస్తూంటాయి. అకీరా కు సోషల్ మీడియా అకౌంట్ లేకపోయినప్పటికీ.. రేణుదేశాయ్.. అకీరాకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా అకీరా నందన్ జిమ్ లో కష్టపడతూ కనిపించాడు. తెలుగు పాటలు వింటూ వర్కౌట్స్ చేసే వీడియోను తల్లి రేణూ దేశాయ్ ఇన్ స్టాలో షేర్ చేసింది. కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది. మీరూ ఆ వీడియో చూడండి.
ఇక ఈ వీడియోలో జిమ్ లో పాటలు వింటూ వర్కౌట్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియోను తల్లి రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. అంతేకాదు, తెలుగు పాటలు వింటున్న అకీరాను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని చెప్పింది. ఈ కాలం యువత కూడా మాతృభాషను గౌరవిస్తారని ఆశిస్తున్నానని రేణూ క్యాప్షన్ పెట్టింది. “చాలా మంది జిమ్ చేసే సమయంలో గట్టి గట్టిగా ఇంగ్లీష్ పాటలు పెట్టుకుని వింటుంటారు. కానీ, ఆ ట్రెండ్ కు బదులుగా జిమ్ చేసే సమయంలో తెలుగు పాటలు వినమని నేను ఎప్పుడూ అకీరాకు చెప్తుంటాను. నేను వర్కౌట్ చేసే సమయంలో మాత్రం హిందీలో పాటలను వింటుంటాను. అకీరా మాదిరిగానే యువ తరం వారి మాతృభాషలో పాటలు వినయడంతో పాటు ఆ భాషను కొనసాగించాలని కోరుకుంటున్నాను” అని రేణూ దేశాయ్ రాసుకొచ్చారు.
ఇక ఇటీవలే అకిరా నందన్ (Akira Nandan) సంగీత దర్శకత్వం వహించిన ఓ షార్ట్ ఫిలిం రిలీజయింది. ఒక రచయితకు సంబంధించిన కథాంశంతో కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వంలో రైటర్స్ బ్లాక్ అనే షార్ట్ ఫిలిం తెరకెక్కింది. ఈ సినిమాలో మనోజ్ అనే యువకుడు నటించాడు. ఈ షార్ట్ ఫిలింకు అకిరా నందన్ మ్యూజిక్ అందించాడు. నాలుగున్నర నిముషాలు ఉన్న ఈ షార్ట్ ఫిలింకు అకిరా అందించిన మ్యూజిక్ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు, నెటిజన్లు అకిరా నందన్ పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
అలాగే అకీరా నందన్. పవణ్ కల్యాణ్, రేణూ దేశాయ్ ముద్దుల కొడుకు. సైలెంట్ గా ఉండే కుర్రాడని చెప్తారు. బయట చాలా తక్కువగా కనిపిస్తాడు. మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్, ఈవెంట్ లలో మాత్రమే కనిపిస్తుంటాడు. అకీరా ఎక్కుడ కనిపించినా సోషల్ మీడియాలో ఇట్టే వార్తలు వైరల్ అవుతాయి. ఆయన ఫోటోలు ట్రెండింగ్ లోకి వస్తాయి. ఈ క్రమంలో అకీరా సినిమాల్లోకి వస్తాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే తల్లి రేణూ దేశాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో ఆయన నటించాడు. అతని నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.
